పోలీసులను చేజ్ చేసి చుక్కలు చూపించిన విద్యార్థి... వీడియో వైరల్‌

సాధారణంగా రోడ్లపై ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే వారి నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు తమ బైక్ లను వెనక్కి తిప్పి అక్కడి నుంచి జారుకుంటుంటారు.;

Update: 2025-10-28 06:08 GMT

సాధారణంగా రోడ్లపై ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే వారి నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు తమ బైక్ లను వెనక్కి తిప్పి అక్కడి నుంచి జారుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు ఎన్నో మనకు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక వీటికి వచ్చే కామెంట్లు, రియాక్షన్లు ఎంతో ఫన్నీగా ఉండడంతో పాటు ఆలోచింపజేస్తుంటాయి.

కానీ ముంబైలో ఓ విద్యార్థి పోలీసులకే చుక్కలు చూపించాడు.

హెల్మెట్‌ లేకుండా డ్రైవ్‌ చేసినందుకు జరిమానా విధించడంతో ఆగ్రహించిన విద్యార్థి ట్రాఫిక్‌ పోలీసులపై విరుచుకుపడ్డాడు. ‘పోలీసులే నియమాలు ఉల్లంఘిస్తున్నారు’ అంటూ వారిని వెంబడించి వీడియో తీశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే వెస్ట్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

నంబర్ ప్లే్ట్ స్పష్టంగా లేదని..

ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులు నడిపిన స్కూటర్‌ నంబర్‌ప్లేట్‌ స్పష్టంగా కనపడలేదని ఆరోపించిన ఓ విద్యార్థి, తన స్నేహితుడితో కలిసి వారిని వెంబడించాడు. వీడియోలో పోలీసులు నడిపిన స్కూటర్‌ వెనుక కూర్చున్న అధికారి హెల్మెట్‌ లేకుండా కనిపించడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఆ సమయంలో యువకుడు స్కూటర్‌ వెనుకకు చేరి హ్యాండిల్‌ పట్టుకునే ప్రయత్నం చేయడం కూడా వీడియోలో స్పష్టంగా రికార్డయింది.

నెట్టింట వీడియో వైరల్

అతను “నంబర్‌ప్లేట్‌ కనపడడం లేదు” అని ప్రశ్నించగా, ఒక పోలీస్‌ అధికారి “ఇది మా వాహనం కాదు, స్వాధీనం చేసుకోవడానికి తీసుకొచ్చాం” అని సమాధానమిచ్చారు. దానికి యువకుడు “సీజ్‌ చేయాల్సిన వాహనాన్ని మీరు ఎలా నడుపుతున్నారు?” అంటూ ప్రతివాదించాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో పెద్ద చర్చ మొదలైంది.

స్పందించిన పోలీసులు

వైరల్‌ వీడియోపై స్పందించిన థానే పోలీసులు, “వీడియోలో కనిపించిన యువకుల్లో ఒకరు హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపినందుకు చర్య తీసుకున్నాం. ఆ చర్యపై అసంతృప్తితో యువకులు వాదనకు దిగారు. స్వాధీనం చేసుకున్న వాహనానికి సంబంధించిన నంబర్‌ప్లేట్‌ సమస్యపై చర్య తీసుకున్నాం” అని ఎక్స్‌ ట్విట్టర్‌)లో వెల్లడించారు.

అదే సమయంలో పోలీసులు ఆ వీడియోను “తప్పుదోవ పట్టించే”దిగా పేర్కొన్నారు. వీడియోలో చూపిన దృశ్యాలు పూర్తి వాస్తవాలను ప్రతిబింబించవని స్పష్టం చేశారు.

ప్రశ్నించడమే కాదు.. నిబంధనలూ పాటించాలి

ఈ ఘటన మరొకసారి సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని గుర్తు చేసింది. చట్ట ఉల్లంఘనపై ప్రజలు ప్రశ్నించడం మంచిదే కానీ, అదే సమయంలో నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. హెల్మెట్‌ లేకుండా డ్రైవ్‌ చేస్తూ పోలీసులు తప్పు చేస్తున్నారని వీడియో తీయడం కన్నా, ముందుగా మనం సురక్షితంగా ఉండటమే ముఖ్యం. ప్రస్తుత సమయంలో అధికారులతో వాదనకు దిగే ముందు ‘నిబంధనల పాటింపున’కే ప్రాధాన్యం ఇవ్వాలి.



Tags:    

Similar News