అమ్మాయిల అశ్లీల వీడియోలు తీసిన క్రికెటర్స్ అరెస్ట్
ఆటగాళ్లు అరెస్ట్ అయ్యి, బెయిల్ పై బయటకు వచ్చారు. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు పై మెజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు.;
క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్ అంటారు. అలాంటి జెంటిల్‌మెన్ గేమ్‌లో ఒకప్పుడు కొన్ని దేశాలు మాత్రమే ఉండేవి, వారు చాలా హుందాగా ఉండేవారు. కానీ ఇప్పుడు క్రికెటర్స్ హుందాగా ఉండటం లేదు. ముఖ్యంగా కొత్త కుర్రాళ్లు స్టేడియంలో హుందాగా వ్యవహరించడం లేదు. ఇటీవల ఒక ఆటగాడు డ్రెస్సింగ్ రూంలో స్మోకింగ్ చేస్తూ లైవ్‌లో కనిపించాడు. దాంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారు అసలు క్రికెట్‌కి దూరంగా ఉండాలని, మరోసారి అతడు బ్యాట్ పట్టుకోకుండా చేయాలని చాలా మంది సీనియర్‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై ఆ క్రికెటర్ స్పందించలేదు. వివరణ కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించలేదు.
అండర్ 19 క్రికెట్ జట్టు...
ఒకవైపు డ్రెస్సింగ్ రూంలో స్మోకింగ్ వివాదం నడుస్తున్న సమయంలోనే మరో వైపు శ్రీలంక అండర్ 19 క్రికెటర్లు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. కొలంబోలోని నరహెన్‌పిటలోని ఒక హోటల్‌లో శ్రీలంక అండర్ 19 క్రికెటర్లు బస చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం వారు రెడీ అవుతున్నారు. అందుకోసం రెడీ అవుతున్న క్రికెటర్ల కోసం అక్కడి క్రికెట్ బోర్డ్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌లో కొందరు మహిళలు స్నానం చేస్తున్న సమయంలో క్రికెటర్లు కొందరు వారిని రహస్యంగా వీడియోలు తీశారు. ఆ విషయాన్ని గుర్తించిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందట. దాంతో దర్యాపు చేసిన పోలీసులు అండర్ 19 జట్టు సభ్యుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ విషయమై అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తుండటంతో మొత్తం పరువు పోయిందని శ్రీలంక క్రికెట్ అసోషియేషన్ తల పట్టుకుంది.
శ్రీలంక క్రికెటర్..
ఇప్పటికే శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న కారణంగా క్రికెట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పటితో పోల్చితే శ్రీలంకలో క్రికెట్‌కి ఆధరణ తగ్గింది, ఆధాయం దారుణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో క్రికెటర్లు మరింత హుందాగా ఉండి, మంచి ఆటతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాల్సి ఉంది. కానీ అనూహ్యంగా అశ్లీల వీడియోలు తీస్తూ అంతర్జాతీయ మీడియాకు పట్టుబడటంతో పరువు పోయింది. ఇప్పటికే అండర్ 19 జట్టు ను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుకు మొత్తం టీమ్ ను ఎందుకు శిక్షించాలంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డ్ వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
ఆటగాళ్ల అరెస్ట్, బెయిల్..
ఆటగాళ్లు అరెస్ట్ అయ్యి, బెయిల్ పై బయటకు వచ్చారు. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు పై మెజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు. అయినా కూడా క్రికెట్ బోర్డ్ ఎందుకు వారిని శిక్షంచడం లేదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆడవారిని గౌరవించని వారు భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా ఎంత హుందాగా ఉంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. క్రికెటర్స్ కి ఉండాల్సిన క్రమశిక్షణ వారికి లేకపోవడం వల్ల వారిని పూర్తిగా ఆటకు దూరం చేయాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో శ్రీలంక అండర్ 19 ఆటగాళ్ల గురించి ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. దాంతో మొత్తం శ్రీలంక క్రికెటర్లు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే ఆవేదన వ్యక్తం అవుతోంది.