కోల్ కతా గ్యాంగ్ రే*ప్.. సంచలన విషయాలు వెల్లడించిన పోలీసుల!

అవును.. సౌత్‌ కోల్‌ కతా లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేపు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-30 10:11 GMT

సౌత్‌ కోల్‌ కతా లా కాలేజీలో విద్యార్థిని (24) పై ఓ పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్ విద్యార్థులు కలిసి క్యాపస్ లోనే అత్యాచారం చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అదే రాష్ట్రంలో గత ఏడాది ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత జరిగిన ఈ సంఘటన దిగ్భ్రాంతి కలిగించింది. దీనిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

అవును.. సౌత్‌ కోల్‌ కతా లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేపు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. ఈ కేసులో సెక్యూరిటీ గార్డు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు! ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే న్యాయ విద్యార్థినిపై అత్యా*చారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ముందు నుంచే విద్యార్థినులను వేధించిన చరిత్ర వారికి ఉందని వెల్లడించారు. పలు సందర్భాల్లో రికార్డు చేసిన దృశ్యాలతో విద్యార్థులను బ్లాక్‌ మెయిల్ చేసేవారని తెలిపారు.

ఈ క్రమంలోనే వీరి చేతిలో అత్యా*చారానికి గురైన విద్యార్థినిని కాలేజీలోకి అడుగుపెట్టిన తొలి రోజే వేధించారని.. ఆమెపై అత్యాచారానికి ముందు కూడా లైంగికంగా వేధిస్తూ రికార్డు చేసిన దృశ్యాలతో బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేశారని తెలిపారు! ఈ నేపథ్యంలో.. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు ఎవరికైనా షేర్‌ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

దీనికోసం.. ముగ్గురు నిందితుల ఫోన్ లను ఇప్పటికే స్వాధీనం చేసుకొన్నామని చెప్పిన పోలీసులు.. నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో... స్టూడెంట్స్‌ యూనియన్‌ రూమ్‌, వాష్‌ రూమ్‌, గార్డ్స్‌ రూమ్‌ నుంచి ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిపారు.

కాగా... విద్యార్థినికి ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందులో ఆమెపై గ్యాంగ్ రే*ప్‌ జరిగినట్లు నిర్ధారణ అయ్యిందనే సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా.. బాధితురాలి వ్యక్తిగత అవయవాలను గాయపరిచారని.. మెడ చుట్టూ, ఛాతీపై పంటి గాట్లు, గోళ్లతో గీరిన గాయాలయ్యాయని చెబుతున్నారు!

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతోన్న మోనోజిత్‌ మిశ్ర (31) అకృత్యాల గురించి పలువురు జూనియర్ విద్యార్థులు పోలీసులకు కీలక విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తనను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రతి అమ్మాయితో మాటలు కలిపేవాడని.. ఈ క్రమంలోనే అత్యాచారానికి గురైన యువతిని అలానే వేధించేవాడని తెలిపారు.

Tags:    

Similar News