కేసీఆర్-జగన్-విజయ్ : ప్రాంతీయ కూటమి ప్లాన్ ?
ఒక తాజా ముఖ్యమంత్రితో చేతులు కలిపి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ రాజకీయ పునరుత్తేజం పొందాలని చూస్తున్నారా.
ఒక తాజా ముఖ్యమంత్రితో చేతులు కలిపి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ రాజకీయ పునరుత్తేజం పొందాలని చూస్తున్నారా. ఏకంగా సౌత్‌లో రీజనల్ రెలీజియన్ ఫ్రంట్ కి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే మాట వస్తోంది. ఆ పార్టీలు బీఆర్ఎస్, వైసీపీ టీవీకే అయితే అధినాయకులు కేసీఆర్ జగన్ విజయ్ అని అంటున్నారు. ఇందులో కేసీఆర్ రెండు సార్లు తెలంగాణాకు సీఎం గా చేసి ఓటమి పాలు అయ్యారు. ఏపీలో ఒకసారి అధికారంలోకి వచ్చిన జగన్ కూడా రెండేళ్ళుగా మాజీ సీఎం గా ఉన్నారు. ఇక రెండేళ్ళ క్రితం పార్టీ పెట్టి తాజాగా తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విజయ్ ఇపుడు కేసీఆర్ జగన్ భవిష్యత్తు రాజకీయాకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు అని అంటున్నారు.
రీజనల్ ఫ్రంట్ అంటే :
నిజానికి ఈ రోజున దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఎన్డీయేలో జనసేన టీడీపీ ఉంటే మరి కొన్ని పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో ఉన్నాయి. అయితే ఈ రెండు కూటములలో లేని ఉండలేని ప్రాంతీయ పార్టీలుగా తెలుగు నాట బీఆర్ఎస్ వైసీపీలను చెప్పుకోవాలి. ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్ధి. దాంతో ఇండియా కూటమిలోకి కలవలేరు, అలాగే ఎన్డీయే నాయకత్వంలోని కూటమిలో కూడా చేరలేరు. దాంతో తమకు తాముగా దక్షిణాదిన ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసుకుంటే రేపటి రోజున అంటే 2029 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోతే తమ బలం అవసరం అవుతుందని అలా తమకు డిమాండ్ ఉంటుందని ఒక కొత్త ప్రయత్నానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే విజయ్ తో :
ఇక తమిళనాడులో విజయ్ పార్టీ గెలవడం ఏంటి అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అయిపోయాయి. అంతే కాదు విజయ్ కి కంగ్రాట్స్ చేస్తూ చెలిమికి తెర తీశాయి. ఇక్కడ వైసీపీకి టీవీకేకి సిద్ధాంతపరంగా సారూప్యం కంటే రెండు పార్టీలకూ క్రిస్టియన్ మైనారిటీ ఓటు బేస్ మాత్రం ఒక కామన్ పాయింట్ గా చెబుతున్నారు.ఇక సంక్షేమ పధకాలు ఇతర అంశాలలో జగన్ స్ట్రాటజీని విజయ్ ఫాలో అవుతున్నారని కూడా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లతో కూడిన బీజేపీ కూటమిని ఢీ కొట్టాలంటే ఈ సఖ్యత కొత్త కూటమి అవసరం అని వైసీపీ భావిస్తూంటే తెలంగాణాలో కూడా దూసుకుని వస్తున్న బీజేపీని ఎన్డీయే కూటమి ఏర్పాటుని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కూడా విజయ్ వంటి మిత్రుడి వైపు చూస్తోంది అని అంటున్నారు. ఇది కేసీఆర్ కి జగన్ కి రాజకీయ అనివార్యంగా కనిపిస్తుంది అని అంటున్నారు.
కేసీఆర్ జగన్ అంటేనే :
ఇక కేసీఆర్ జగన్ ల మధ్య బలమైన స్నేహం ఉంది అన్నది తెలిసిందే. ఇక ఓటమి తరువాత కూడా బెంగళూర్ ఎలహంక ప్యాలెస్ లో కేటీఆర్ జగ్న సమాలోచనలు జరిపారు అని ప్రచారంలో ఉంది. అలాగే ఎలహంక ప్యాలెస్ నుంచి హైదరాబాద్ కి జగన్ రావాలని లోటస్ పాండ్ లో ఆయన మకాం పెట్టాలని బీఆర్ ఎస్ ఒత్తిడి కూడా తెస్తోంది అని అంటున్నారు. వీటి వెనక కూటమి ప్రాంతీయ స్థాయిలో ఏర్పాటు ప్రయత్నం ఉందని అంటున్నారు.
కాంగ్రెస్ తో విజయ్ :
అయితే ఈ ప్రాంతీయ స్థాయి కూటమికి ఒక అడ్డంకి ఆదిలోనే ఎదురవుతోంది. అదే విజయ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం. తన ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతుని విజయ్ కోరారు. రాహుల్ గాంధీ ఏకంగా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. దాంతో ఏపీ తెలంగాణాలలో కాంగ్రెస్ పొడ గిట్టని కేసీఆర్ జగన్ వీటిని ఎలా స్వీకరిస్తారు అన్నదే పెద్ద చర్చగా ఉంది. మరో వైపు చూస్తే ఈ కూటమి ప్రాంతీయ స్థాయిలో మూడు రాష్ట్రాలలో మూడు బలమైన పార్టీల మధ్య ఏర్పాటు కావడానికి ప్రయత్నాలు జరగడం వరకూ ఓకే కానీ ఎవరికి వారి ఓటర్లే ఆయా రాష్ట్రాలలో ఉన్నారు. ఎవరు ఎవరికి రాజకీయంగా అండగా ఉంటూ ఆయా రాష్ట్రాలలో ప్రోత్సహించుకోలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఎవరి ఓటర్లు వారికే సెపరేట్ గా ఉండడమే అసలైన మైనస్ పాయింట్ అని అంటున్నారు. దానికి తోడు ప్రాంతీయ ఆకాంక్షల వరకూ సరే అనుకున్నా మత రాజకీయాలను మధ్యలోకి తెస్తే మాత్రం అది ప్రమాదమే కాక బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు.
అవినీతి ముద్రతోనే :
అయితే ఇంకా పురుడు పోసుకోని చర్చలకు ప్రచారానికి పరిమితం అయిన ఈ కూటమికి ఒక బలమైన ముద్ర ఉంది. అదే అవినీతి అని అంటున్నారు. ఏపీలో చూస్తే పార్టీగా వైసీపీని పెట్టక ముందు నుంచే జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద సీబీఐ కేసులు పదహారు నెలల జైలు జీవితం ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 నుంచి 2024 దాకా సాగిన అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో అవినీతి మరో ఎత్తు అని అంటున్నారు. దాని వల్లనే వైసీపీ 2024 లో ఓటమి పాలు అయిందని చెబుతారు. ఒక బీఆర్ఎస్ విషయం తీసుకుంటే ఆ పార్టీ తెలంగాణాలో చేసిన పదేళ్ల పాలనలో కాళేశ్వరం నుండి ఫార్ములా వన్ కార్ రేసింగ్ వరకు భారీ త్తున ఆరోపణలు ఈ రోజుకీ సంచలనంగానే ఉన్నాయని చెబుతున్నారు. మరో వైపు తమిళనాడులో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీ మీద కూడా అవినీతి మరకలు ఆరంభంలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అదెలా అంటే టీవీకేలో ఆ పార్టీ కీలక నేత, మంత్రి అధర్వ అర్జున్ తండ్రి లాటరీ కింగ్ అని చెబుతున్నారు.
కూటమి సాధ్యమా :
అయితే ఈ ముగ్గురు నాయకులూ తమ ప్రభావాన్ని రాజకీయంగా దక్షిణాదిన చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం ప్రాంతీయ కూటమిని కట్టాలని కూడా వ్యూహ రచన చేస్తున్నట్లుగా ప్రచారం అయితే ఉంది. కానీ అవినీతి ఆరోపణలు ఒక వైపు మరో వైపు మత రాజకీయాలను ముందుకు తీసుకుని రావడం వంటివే అడ్డంకిగా మారుతాయా అన్న చర్చ సాగుతోంది. అయితే దక్షిణాదిన ఎన్డీయే కూటమిని మరీ ముఖ్యంగా చంద్రబాబుకు ముకు తాడు వేయాలని ఈ కూటమి పెద్దల ప్రధాన లక్ష్యమని అంటున్నారు. మరి వీరి ఆశలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయన్నది తెలియాలన్నా అనేక ప్రశ్నలకు జవాబు దొరకాలన్నా కొంత కాలం పాటు వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.