సోనియా సైగలకు బీజేపీ డబ్బింగ్...రేటా రాంగా ?

జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయం అందరికీ తెలిసిందే. చాన్స్ దొరికితే చాలు దూసుకుపోతారు.

Update: 2026-08-16 17:47 GMT

జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయం అందరికీ తెలిసిందే. చాన్స్ దొరికితే చాలు దూసుకుపోతారు. ప్రత్యర్థిని పూర్తిగా కార్నర్ చేస్తారు. ఇదిగో పులి అని కూడా అనరు, తోక చూపించాల్సినా అవసరం అంతకంటే లేదు, ప్రత్యర్థిని టార్గెట్ చేయడం మీదనే అతి ఉత్సాహం కనిపిస్తోంది. విద్యార్ధి ఉద్యమాలతో దిమ్మ దిరిగి బొమ్మ కనిపించిన బీజేపీ పరిస్థితి తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమస్తం వానార్పితం అయిన నేపథ్యంతో పాటు అమిత్ షానే రాజీనామా చేయమంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేసే దాకా వ్యవహారం వెళ్ళిపోయింది. దాంతో చిక్కుల్లో పడ్డ బీజేపీకి అనుకోని వరంగా ఆయాచిత అస్త్రంగా ఆగస్టు 15 వేళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక ఉదంతం ద్వారా లభించింది. దాంతో బీజేపీ కాంగ్రెస్ ని రెట్టించి రాజకీయ ఘాటు దట్టిస్తోంది.

వందేమాతరం మీదనేనా :

కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పండుగ సందర్భంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. సాధారణంగా అయితే రెండు చరణాలతో ముగియాల్సిన ఈ గీతం కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన తాజా సవరణల వల్ల ఏకంగా ఆరు చరణాలు పాడాలి. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అదే జరిగింది. అయితే ఆ సమయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె పక్కన నిలుచున్న సోనియా గాంధీ అసహనం ప్రదర్శించడం ఎవరెవరికో ఏదో సైగలు చేయడం మాత్రం వీడియో రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంతకీ సోనియా గాంధీ ఏమి చెప్పారు అన్నది అయితే ఎవరికీ అర్థం కాలేదు, వందేమాతరం గీతాన్ని ఆపమని సోనియా గాంధీ అన్నారని సోషల్ మీడియాలో ప్రత్యర్ధులు ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటిదేమీ లేదని ఖర్గేకు కూర్చోవడానికి కుర్చీ కోసమే ఆమె పార్టీ నేతలను కోరారని వివరణ ఇచ్చింది.

అమిత్ షా డిమాండ్ :

అయితే సోనియా గాంధీ వందేమాతరం గీతాన్ని అవమానించారని అందువల్ల 140 కోట్ల భారతీయులకు మొత్తం ఆమె క్షమాపణలు చెప్పాలని బీజేపీ అగ్ర నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. వందేమాతరం గీతాన్ని ఇది అవమనించడమే అని ఆయన అన్నారు. వందేమాతరం గీతాన్ని ఆపేయమంటారా అని అమిత్ షా ఆగ్రహించారు. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందే అని ఆయన అన్నారు.

సైగలకు బీజేపీ అర్ధం :

ఇక చూస్తే సోనియా గాంధీ సైగలకు అర్ధం ఏమిటో అక్కడ ఉన్న రాహుల్ ఖర్గే కొందరు పార్టీ నేతలకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే నిజంగా వందేమాతరం గీతం మీద వ్యతిరేకత ప్రదర్శించినా కాంగ్రెస్ బాహాటంగా దానిని ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోదు కదా అని జవాబు వస్తుంది. పైగా కాంగ్రెస్ ఇది రాజకీయ వివాదం అవుతుందని బీజేపీకి అస్త్రంగా మారుతుందని ముందే గ్రహించి ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయమని సూచించారని చెబుతోంది. అయితే సోనియా గాంధీ అసహనం ఆమె హావభావాలు చూస్తే ఆ సైగలకు అర్ధం వందేమాతరం గీతం మీద పూర్తి వ్యతిరేకతతోనే ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ వందేమాతరం గీతం ఆలపించకుండా జెండా వందనం పూర్తి చేశారు. మరి కాంగ్రెస్ కి వందేమాతరం గీతం పట్ల అయిష్టత ఉంది కదా అని బీజేపీ నేతలు లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

అమిత్ షా రిటార్ట్ :

అంతే కాదు వందేమాతరం గీతం అధికార కార్యక్రమాలలో మొదట ఆలపించాలని బీజేపీ చట్ట సవరణ చేసినపుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది అని గుర్తు చేస్తున్నారు. ఇక 1937లో కాంగ్రెస్ పార్టీ అయితే వందేమాతరం గీతం ఆరు చరణాలు వద్దు రెండు చాలు అని తీర్మానించి బహిరంగ సభలలో అదే విధానం అనుసరిస్తోంది. మరి ఇవన్నీ చూస్తే కనుక సోనియా సైగలకు బీజేపీ చెప్పిన డబ్బింగ్ చేస్తున్న విమర్శలు సహేతుకమే అనిపిస్తున్నాయి. కానీ వీటికి రుజువు ఏమిటి అంటే జవాబు లేనట్లే. మొత్తానికి అమిత్ షాని రాజీనామా చేయమన్న కాంగ్రెస్ కి ఇపుడు ఆయన నుంచి పదునైన జవాబే వచ్చింది అని అంటున్నారు.

Tags:    

Similar News