స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లిపై కుటుంబం కీలక ప్రకటన
కారణాలు ఏవైనా స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం అయితే ఆగిపోయింది. గుండెపోటు, అనారోగ్యాలు అని చెప్పినా ఈ పెళ్లి ఆగిపోవడం వెనుక రూమర్లు మాత్రం బోలెడన్నీ వచ్చాయి.;
కారణాలు ఏవైనా స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం అయితే ఆగిపోయింది. గుండెపోటు, అనారోగ్యాలు అని చెప్పినా ఈ పెళ్లి ఆగిపోవడం వెనుక రూమర్లు మాత్రం బోలెడన్నీ వచ్చాయి. అయితే వీటిపై సృతి మందానా ఫ్యామిలీ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. కానీ పలాశ్ ముచ్చల్ ఫ్యామిలీ నుంచి మాత్రం తాజాగా ఓ కీలక ప్రకటన వెలువడింది.
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు తెరపడింది. అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడిన వీరి పెళ్లి అతి త్వరలోనే జరుగుతుందని పలాశ్ తల్లి అమిత ముచ్చల్ తాజాగా స్పష్టం చేశారు.
వాయిదా వెనుక అసలు కారణం
నిజానికి ఈ జంట పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా రెండు కుటుంబాలలోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వివాహం నిరవధికంగా వాయిదా పడింది. నవంబర్ 23 ఉదయం స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్‌కు గుండెపోటు లక్షణాలు కనిపించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్లిష్ట సమయంలో పెళ్లి జరపడం సరికాదని భావించి, స్మృతే స్వయంగా వివాహాన్ని వాయిదా వేశారు. అదే సమయంలో పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో సాంగ్లీ ఆసుపత్రిలో చేరారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయని వైద్యులు నిర్ధారించారు.
*ఇప్పుడిక అంతా శుభమే
ప్రస్తుతం రెండు కుటుంబాలలో ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. శ్రీనివాస్ మంధాన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా పలాశ్ కూడా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలాశ్ తల్లి అమిత ముచ్చల్ ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ "స్మృతి–పలాశ్ ఇద్దరూ కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు అందరి ఆరోగ్యం చక్కబడి ఉంది. మా కుటుంబం పెళ్లి ఏర్పాట్లకు సిద్ధంగా ఉంది. త్వరలో వారిద్దరి వివాహం జరుగుతుంది," అని వెల్లడించారు.
*రూమర్లపై మౌనం
పెళ్లి వాయిదా పడటంతో స్మృతి తన వివాహ ఫోటోలను సోషల్ మీడియా నుండి తొలగించడం, పలాశ్‌పై ఇతర మహిళతో చాటింగ్ ఆరోపణలు రావడం వంటి రూమర్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని భావిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే స్మృతి ఫామిలీ నుంచి ఇంకా ఎటువంటి అధికార ప్రకటన లేదు. అమిత ముచ్చల్ మాత్రమే ప్రకటన చేసారు .. చూడాలి ఏమి జరుగుతుందో..