స్లీపర్ లోనే ప్రమాదాలు ఎందుకు.. విస్తుపోయే నిజాలు బయటకు!

అసలు సమస్య ఏంటి అనే విషయానికి వస్తే.. స్లీపర్ బస్సుల్లో 2x1 సీటింగు అందుబాటులో ఉంటుంది.;

Update: 2025-10-24 11:01 GMT

హైదరాబాదు నుండి బెంగళూరు బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు కర్నూలుకి 10 కిలోమీటర్ల దూరంలో దగ్ధమైన దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లో కూడా ఇదే తరహాలో ప్రమాదం జరిగి సుమారుగా 20 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే బస్సు ప్రమాదం అనగానే దాదాపుగా చాలా సందర్భాలలో స్లీపర్ బస్సుల్లోనే ఈ ప్రమాద ఘటనలు జరుగుతున్నాయని.. అటు ప్రజలలో.. ప్రయాణికులలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? డిజైన్ విషయంలో ఏదైనా లోపమా ? లేక డ్రైవర్ నిర్లక్ష్యమా? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మరి స్లీపర్ బస్ లోనే ప్రమాదాలు ఎందుకు అధికంగా జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

అసలు సమస్య ఏంటి అనే విషయానికి వస్తే.. స్లీపర్ బస్సుల్లో 2x1 సీటింగు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సుమారుగా 30 నుంచి 36 బెర్త్ లు ఉంటాయి. ఒకవేళ మల్టీ ఆక్సిల్ బస్సులు అయితే 36 నుండి 40 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్ విస్తీర్ణం.. మనిషి పొడవును బట్టి 6అంగుళాల పొడవు 2.6 అంగుళాల వెడల్పు ఉంటుం. ది అయితే ఇక్కడ బెర్త్ లతో సంబంధం లేదు.. బెర్త్ లకు అనుసంధానించబడిన గ్యాలరీలతోనే అసలు సమస్య. ఇవి ఇరుకుగా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. అటు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఈ ఇరుకైన ప్రాంతం నుండి వేగంగా ప్రయాణికులు బయటకు రాలేక .. ఎక్కువ మంది లోపలే చిక్కుకుపోతున్నారని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇక మరో సమస్య.. బస్సు ఎత్తు.. వీటి ఎత్తు 9 అడుగుల వరకు ఉండడమే. సడన్గా బస్సు ఒకవైపుకు ఒరిగినప్పుడు లేదా కింద పడినప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరుకోవడం కష్టమవుతుంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కి కూడా ఆటంకం కలుగుతుంది. బస్సు ఎక్కి ప్రయాణికులు బయటకు వచ్చేలోపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి ప్రయాణికులు ఎక్కువగా స్లీపర్ బస్సులను ఎంపిక చేసుకోవడానికి కారణం సుదూర మార్గాలను చేరుకునే క్రమంలో.. ఇలా ఎక్కువగా స్లీపర్ బస్సులను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ స్లీపర్ బస్సులు కూడా ఎక్కువగా రాత్రి వేళల్లోనే ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్ కి అలసట వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు రాత్రి వేళలో ప్రయాణిస్తాయి కాబట్టి నిద్రలోకి కూడా జారుకుంటారు.. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో డ్రౌజీనెస్ అలెర్ట్ సిస్టం ఏర్పాటు చేసినా .. వాటి పనితీరు, సామర్థ్యం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులోకి వెళ్ళిపోతున్నాం అంటూ 25% మంది డ్రైవర్లు కూడా అంగీకరించడం ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటలలోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందుకే ప్రమాదం జరిగిన సమయంలో మొదటి రెండు నిమిషాలలో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకమని.. ప్రమాదం జరిగిన వెంటనే తేరుకుంటేనే ప్రాణాలతో భయపడే అవకాశం ఉంటుందని అటు ప్రయాణికులకు కూడా నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

Tags:    

Similar News