ఒంటరి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈయనే!

సాధారణంగా ఎవరూ ఒంటరి తనాన్ని ఇష్టపడమనే చెబుతుంటారు. ఫ్యామిలీ మెంబర్సో, ఫ్రెండ్సో, కొలీగ్సో... ఎవరొకరు తోడు లేకపోతే జుట్టు పీకేసుకుంటుంటారు.

Update: 2024-01-22 03:00 GMT

సాధారణంగా ఎవరూ ఒంటరి తనాన్ని ఇష్టపడమనే చెబుతుంటారు. ఫ్యామిలీ మెంబర్సో, ఫ్రెండ్సో, కొలీగ్సో... ఎవరొకరు తోడు లేకపోతే జుట్టు పీకేసుకుంటుంటారు. కొంతమంది అప్పుడప్పుడూ ఒంటరి తనాన్ని ఇష్టపడుతుంటారు కానీ... అది కూడా కొన్ని సందర్భాల్లోనే! అయితే ఒక పెద్దయన మాత్రం ఒంటరి తనానికి నిలువెత్తు నిదర్శనంలా ఉన్నారు. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడంతో ఇప్పుడు ఇతని స్టోరీ వైరల్ గా మారింది.


అవును... ఒక ఊళ్లో పెద్దాయన ఒక్కరే ఉంటున్నారు. పాతికేళ్లుగా నీటమునిగి, ఆ తర్వాత అనావృష్టి పరిస్థితుల్లో శిథిలావస్థలో బయటపడినపప్టినుంచీ అక్కడ ఈ పెద్దాయన ఒక్కరే ఉంటున్నాడు. అలా అతివృష్టి, అనావృష్టిలను చూసిన ఆ ఊరి పేరు ఎపిక్యూయెన్‌. ఆ ఊరి జనాభా ఒకటి మాత్రమే! అది కూడా ఒక వృద్ధుడు!

వివరాళ్లోకి వెళ్తే... అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిరిస్‌ ప్రావిన్స్‌ కు పరిధిలో ఒక ఊరుంది. ఆ ఊరి పేరు ఎపిక్యూయెన్. ఒకప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ఆ ఊళ్లో దాదాపు రెండువేల మంది నివసిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఏటా సుమారు ఐదువేల మందికి పైగా పర్యాటకులు అక్కడికి వచ్చి వెళుతుండేవారు.

అయితే దురదృష్టవశాత్తు 1985లో ఆ ఊరికి చేరువలో ఉన్న డ్యామ్‌ వరదల కారణంగా ధ్వంసమైంది. దీంతో ఊర్లోకి వరద నీరు రావడంతో.. ఆ ఊరు కనుమరుగైంది. ఈ క్రమంలో సుమారు పాతికేళ్లుగా ఈ ఊరు నీటి అడుగునే ఉంది. ఆ తర్వాత కాలంలో అనావృష్టి పరిస్థితులు నెలకొనడం, అక్కడున్న నీరంతా ఆవిరైపోవడంతో 2009లో ఆ ఊరు బయటపడింది.

దీంతో గతంలో అదే ఊరిలో నివశించిన పాబ్లో నోవాక్‌ అనే పెద్దాయన తన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాడు. ఊరిపై ఉన్న మమకారంతోనో ఏమో కానీ... ఎవరూ లేకపోయినా నాటి నుంచీ ఇక్కడే నివశిస్తున్నాడు. సుమారు తొంబైమూడేళ్ల వయసు కలిగిన ఆయన ఒంటరిగా బతుకుతున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

దీంతో... "ప్రపంచంలోని అత్యంత ఒంటరి మనిషి" గా అభివర్ణిస్తూ ఈయనపై ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు రావడం మొదలయ్యింది. ప్రస్తుతం ఈయన గురించి, ఇతని లైఫ్ స్టైల్ గురించి నెట్టింట సెర్చ్ మొదలైంది.

Tags:    

Similar News