• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గొర్రెల స్కాంపై ఈడీ...

గొర్రెల స్కాంపై ఈడీ సోదాలు : బీఆర్ఎస్ లో టెన్షన్.. టెన్షన్..

| తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న గొర్రెల స్కాంపై ఈడీ దర్యాప్తు ముమ్మరమైంది.

By - Tupaki Desk
Update: 2025-07-30 14:56 GMT

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న గొర్రెల స్కాంపై ఈడీ దర్యాప్తు ముమ్మరమైంది. బుధవారం హైదరాబాద్ నగరంలో సుమారు పది చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు మీడియా కథనాలు ప్రసారమవుతున్నాయి. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సిబ్బంది ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, గొర్రెలను పంపిణీ పథకం ప్రవేశపెట్టారు. అయితే గొర్రెలను పంపిణీ చేయకుండానే ప్రజా ధనాన్ని దారి మళ్లించారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏసీబీ విచారణ చేపట్టారు. సుమారు రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ తేల్చడంతో ఈడీ రంగంలోకి దిగింది.

రూ.700 కోట్ల స్కాం

ఏసీబీ కేసు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ హైదరాబాద్ లో చేపట్టిన సోదాలతో కలకలం చెలరేగింది. గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన వ్యక్తులు, సంస్థల ఇళ్లు, కార్యాలయాల్లోనే ఈ సోదాలు జరిగాయి. కోట్ల రూపాయల డబ్బు, విలువైన పత్రాలు, కీలక సాక్ష్యాధారాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతుండటం ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైందని అంటున్నారు. సుమారు రూ.700 కోట్లు చేతులు మారాయని ఏసీబీ నిర్ధారించడం, పెద్ద ఎత్తున డబ్బులు మారిందన్న సమాచారం, ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉండటంతో ఈడీ దర్యాప్తు టెన్షన్ పుట్టిస్తోంది.

రూ.4 వేల కోట్లతో అమలు

2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్దిదారులకు రూ.4 వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేశామని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. పథకం ప్రారంభించిన తొలి నాళ్ల నుంచే కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారని, మధ్యవర్తులతో కలిసి డబ్బు దారి మళ్లించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

బినామీ పేర్లతో కొట్టేశారు?

అసలు లబ్దిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి ప్రజాధనం మళ్లించినట్లు ఏసీబీ గుర్తించిందని చెబుతున్నారు. కొంత మంది విక్రేతలకు డబ్బు ముట్టినట్లు రికార్డుల్లో చూపి ఆ మొత్తాన్ని నేతలు, అధికారులు వాటాలు వేసుకుని పంచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్కాంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతకు సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన మంత్రిగా పనిచేయగా, ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఓ అధికారి ఇంట్లో తనిఖీలు చేయడం, పెద్ద ఎత్తున నగదు గుర్తించినట్లు కథనాలు రావడంతో కలకలం రేగుతోంది.

Tags:    
  • TelanganaScam 
  • SheepDistributionScam 
  • EDRaids 
  • 700CroreScam 
  • BRSGovernment 
  • ACBInvestigation 
  • PoliticalCorruption 
  • HyderabadNews 
  • TelanganaPolitics 
  • MoneySeize 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS