శశిథరూర్ ని కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఏమీ అనకూడదా?
అవును... మురళీధరన్ వ్యాఖ్యలపై స్పందించిన థరూర్... ఇలాంటి వాదనలు చేయడానికి వారి వద్ద ఎలాంటి ఆధారం ఉందని ప్రశ్నించారు.;
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలుచుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ సమయంలో... ఆయన తన వైఖరిని మార్చుకునే వరకు కేరళలో జరిగే ఏ పార్టీ కార్యక్రమానికి తనను ఆహ్వానించబోమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె మురళీధరన్ అన్నారు.
ఇదే సమయంలో... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు కూడా అయిన థరూర్ ను ఇకపై 'మనలో ఒకరు'గా పరిగణించడం లేదని.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని మురళీధరన్ తెలిపారు. ఈ సమయంలో.. మురళీధరన్ వ్యాఖ్యలపై స్పందించిన థరూర్... తనను దూరం పెడతామని చెప్పడానికి ఆయన ఎవరని అన్నారు!
అవును... మురళీధరన్ వ్యాఖ్యలపై స్పందించిన థరూర్... ఇలాంటి వాదనలు చేయడానికి వారి వద్ద ఎలాంటి ఆధారం ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారికి పార్టీలో ఏ అధికారం లేదంటూ మురళీధరన్ ను ఉద్దేశించి అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని, వాటిన్నింటికీ స్పందించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
కాగా... పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పుకుంటూ శశిథరూర్.. బీజేపీ నేతలతో అంటకాగుతున్నారని, ఆయన ఇప్పుడు కాషాయదళం మనిషి అయిపోయారంటూ కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఇటీవల విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అతని ప్రవర్తనపై అధిష్టాణం ఆగ్రహంగా ఉందని తెలిసినా.. లైట్ తీసుకుంటున్నట్లున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పై పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. సీ.డబ్ల్యూసీ మెంబర్ కూడా అయిన థరూర్... ఇలా అధిష్టానాన్ని దిక్కరించి మోడీ & కో చుట్టు తిరిగితే, ఎవరూ ఏమీ అనరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు! మరి థరూర్ విషయంలో కాంగ్రెస్ అధిష్టాణం ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి!
పైగా... పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత థరూర్ ప్రతిస్పందనలపై కాంగ్రెస్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. మలయాళ దినపత్రికలో "అత్యవసర పరిస్థితి"పై ఇందిరా గాంధీని విమర్శిస్తూ రాసిన వ్యాసం తర్వాత థరూర్ పై విమర్శలు పెరిగాయని అంటున్నారు. ఇవన్నీ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ తనను ఏమీ అనకూడదు అన్నట్లుగా థరూర్ స్పందించడం హాస్యాస్పదమని అంటున్నారు!!