ఓ షర్మిల...ఓ కవిత...ఆ రెండు పార్టీలకూ గండమే !
ఇలా ఇద్దరు చెల్లెమ్మలు ఒకే బాటన పయనిస్తున్నారా అన్నదే ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు.;
వైసీపీ ఎందుకు ఓడిపోయింది అంటే ఈ రోజుకీ సరైన విలువైన కారణం చెప్పలేరు. ఎందుకు అంటే అనేక కారణాలు అందులో ఇమిడి ఉన్నాయి. వాటిలో అత్యధిక శాతం అధినాయకత్వానికి నేరుగా సంబంధం ఉన్నవే. అందువల్లనే ఓటమి మీద ఆత్మ విమర్శలు సమీక్షలు పూర్తి స్థాయిలో ఉన్నాయా అన్నదే ప్రశ్న.
వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ అతి ప్రధాన కారణం సెంటిమెంట్ లాంటి వైఎస్ షర్మిల అంటే ఆ పార్టీ పెద్దలు ఒప్పుకోక పోవచ్చు. కానీ ఇది పచ్చి నిజం అనే కఠిన విశ్లేషణలు ఉన్నాయి. షర్మిల జగన్ మీద నేరుగా చేసిన ఆరోపణలను వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ జిల్లాల వారు నమ్మారు. అందుకే మొత్తంగా 52 అసెంబ్లీ సీట్లకు గానూ ఏడంటే ఏడు సీట్లు మాత్రమే దక్కాయని చెబుతారు.
ఇక షర్మిల జగన్ మీద తన రాజకీయ పోరాటానికి ముందు వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీకి స్ట్రాంగ్ గా సపోర్టు చేసే ఒక ప్రముఖ చానల్ ని ఎంచుకున్నారు ఆ చానల్ నుంచే ఆమె జగన్ మీద తాను చేయబోయే భవిష్యత్తు పోరాటాల గురించి చూచాయగా వివరించారు. ఆ తరువాత కూడా జరిగింది అదే. వైసీపీ ఫ్యాన్ కి ఎదురు నిలిచి సునామీ లాంటి ఎదురు గాలితో ఫల్టీ కొట్టించడం వెనక షర్మిల ప్రభావం గాఢంగా ఉందని అంతా నమ్ముతారు.
ఇక చూస్తే అదే బాటలో బీఆర్ఎస్ లో మరో చెల్లెమ్మ కవిత వెళ్తున్నారా అన్నది చర్చగా ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ టీడీపీకి బలమైన మద్దతుగా ఉన్న ఒక ప్రముఖ చానల్ కి వెళ్ళి మరీ కవిత తన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె కూడా బీఆర్ఎస్ మీద పరోక్ష విమర్శలు చేశారు. కేసీఆర్ కేటీఆర్ ల గురించి ఆమె తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు.
బీఆర్ఎస్ లో తన పాత్ర గురించి చెప్పారు. ఇక తన రాజకీయ ఆకాంక్షల గురించి కూడా ఆమె ఎక్కడా దచుకోవడంలేదు. ఇవన్నీ కూడా సహజంగానే బీఆర్ఎస్ కి పెద్దగా గిట్టని చానల్ లో ఆమె ఇంటర్వ్యూ రూపంలో ఇవ్వడం అంటే కచ్చితంగా గులాబీ పార్టీకి గుచ్చుకున్నట్లే అని అంటున్నారు.
ఇలా ఇద్దరు చెల్లెమ్మలు ఒకే బాటన పయనిస్తున్నారా అన్నదే ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇక కవిత తనకు ఉన్న తెలంగాణా జాగృతి వేదిక నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ కేసీఆర్ సహనాన్ని పరీక్షిస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఇస్తున్న ప్రకటనలు ఆమె వైఖరి కేసీఆర్ కి ఇబ్బందిగానే మారుతున్నాయని కూడా అంటున్నారు.
ఇది చాలదు అన్నట్లుగా బీఆర్ఎస్ మీద నిత్యం ఏదో విధంగా వ్యతిరేక వార్తలు వండి వార్చే ఒక చానల్ లో కూర్చుని ఇంటర్వ్యూలు ఇవ్వడం అంటే ఆమె ఏమి చెప్పదలచుకున్నారు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఆమె చేయడం ద్వారా బీఆర్ఎస్ ని ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టేశారు అని అంటున్నారు.
నాడు ఒక చెల్లెమ్మ కొంగు బిగించి వైఎస్ జగన్ కి ఆగర్భ ప్రత్యర్థిగా మీడియా రంగంలో ఉన్న ఒక చానల్ ముందు చెప్పాల్సింది అంతా చెప్పరు. అలా ఆమె వేసిన తొలి అడుగు వైసీపీ రాజకీయ పతనానికి దారి తీసింది అని గుర్తు చేస్తున్నారు. పట్టుదలలో తన అన్నకు ఎక్కడా తీసిపోని షర్మిల పనిగట్టుకుని ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించి తాను ఏమి లబ్ది పొందారో తెలియదు కానీ తన అన్నను మాజీ సీఎం గా చేయడానికి మాత్రం ఎంతగానో దోహద పడ్డారు అని విశ్లేషణలు ఉన్నాయి.
ఇక ఇపుడు షర్మిల కూడా బీఆర్ఎస్ పెద్దలు వ్యతిరేకించే చానల్ లో ద్వారానే తొలి అడుగు వేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. అలా ఆమె వేసే అడుగులు రేపటి రోజున బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుకు గండంగా మారుతాయా అన్నదే చర్చగా ఉంది. ఆంధ్రాలో ఒక ఆడపడుచు పిడికిలి బిగిస్తే వైసీపీకి ఏమి జరిగిందో అంతా చూశారు.
ఇక తెలంగాణాలో చూస్తే మరో ఆడపడుచు దూకుడు చేస్తున్నారు. మరి గులాబీ పార్టీకి ముళ్ళు గట్టిగానే గుచ్చుతాయని అంటున్నారు. అయితే షర్మిలను కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ తన ఆయుధంగా ప్రయోగించింది అని అంటారు. కవితకు ఏ రాజకీయ పార్టీ దన్ను దొరుకుందో ఏ రకమైన అండ ఆమె అందుకోబోతున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు.