వీడు మామూలు దొంగ కాదు.. కోర్టుకు వెళ్లి వస్తూ చేతివాటం
అదిరే నైపుణ్యం ఉన్నప్పుడు నెగిటివ్ అంశాల విషయంలో కోపం వచ్చినా.. అతగాడి అద్వితీయమైన టాలెంట్ కు మాత్రం వావ్ అనకుండా ఉండలేం;
రంగం ఏదైనా సరే.. సరైన టాలెంట్ కంట పడితే వావ్ అనేస్తాం. అదిరే నైపుణ్యం ఉన్నప్పుడు నెగిటివ్ అంశాల విషయంలో కోపం వచ్చినా.. అతగాడి అద్వితీయమైన టాలెంట్ కు మాత్రం వావ్ అనకుండా ఉండలేం. ఎంత గుండెలు తీసిన బంటు కాకుంటే..తన మీద ఉన్న కేసు అంశంలో కోర్టుకు వెళ్లి వస్తున్న అతగాడు.. చుట్టూ పరిస్థితులు సానుకూలంగా మారితే.. తన టాలెంట్ ను ఏ టైంలో అయినా ప్రదర్శించేందుకు వెనుకాడడు. అంతకూ అసలేం జరిగిందంటే..
ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెంకు చెందిన శ్యాం అలియాస్ వంశీక్రిష్ణకు 43 ఏళ్లు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లోని ఒక కాలనీలో నివాసం ఉంటాడు. ఆన్ లైన్ లో దుస్తులు విక్రయిస్తుంటాడు. బుద్దిగా వ్యాపారం చూస్తే వచ్చే ఆదాయం అతనికి సరిపోవట్లేదు. అందుకే.. అదనపు ఆదాయం కోసం తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు. అలా దొంగలించిన సొత్తును అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు.
గత ఫిబ్రవరి 21న చౌటుప్పల్ కు చెందిన నర్సింహ ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి తాళం పగుల కొట్టి ఉన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. బీరువాలోఉన్న రూ.14.2 లక్షల నగదును దొంగలించినట్లుగా గుర్తించిన బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేస్తుంటారు. తన ఇంట్లో జరిగిన చోరీపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ దొంగ ఆచూకీ లభించలేదు.
ఇదిలా ఉంటే.. పోలీసులు ఈ దొంగను పట్టేశారు. దొంగతనాల్లో తిరుగులేని రీతిలో చోరీలు చేస్తున్న శ్యాంను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతడి మీద మొత్తం 62 కేసులు ఉన్నాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో ఇతగాడి మీద ఇరవై కేసులు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఇటీవల ఖమ్మం జిల్లా కోర్టుకు ఒక చోరీ కేసులో విచారణకు హాజరైన అతను.. తిరిగి వెళుతూ చౌటుప్పల్ లో తాళం వేసిన ఇంట్లో రూ.14.20 లక్షలు కొట్టేసి.. ఎంచక్కా సిటీకి వచ్చేశాడు. పోలీసులు రంగంలోకి దిగటంతో శ్యాం ఆటకు క్ పడింది. ఏమైనా.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వెళ్లక తప్పదనే చెప్పాలి.