• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విడాకుల ప్రభావం: రన్నింగ్...

విడాకుల ప్రభావం: రన్నింగ్ ట్రైన్ లో నిప్పంటించాడు.. వీడియో వైరల్!

| ఇటీవల కాలంలో కొంతమందికి విడాకులు అత్యంత సాధారణ విషయంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-27 18:30 GMT

ఇటీవల కాలంలో కొంతమందికి విడాకులు అత్యంత సాధారణ విషయంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరికొంతమందికి మాత్రం దీన్ని జీవితంలోనే అతిపెద్ద విషాదంగా భావిస్తుంటారు. ఈ సమయంలో విడాకులతో కలత చెందిన సుమారు 67 ఏళ్లున్న వ్యక్తి.. రన్నింగ్ ట్రైన్ లో నిప్పు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... సియోల్‌ లో కదులుతున్న సబ్‌ వే రైలు లోపల ఓ వ్యక్తి నిప్పటించారు. అతనిని ఇంటిపేరు వోన్‌ తో గుర్తించినట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ సంఘటన మే 31న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్ర ఆస్తినష్టంతో పాటు, ప్రయాణికులు పలువురు తీవ్ర గాయాలపాలైనట్లు నివేదించింది.

వివరాళ్లోకి వెళ్తే... సియోల్ సబ్‌ వే లైన్ 5లో, యౌయినారు - మాపో స్టేషన్స్ మధ్య ఉన్న సెక్షన్‌ లో ఉదయం 8:42 గంటల ప్రాంతంలో రైలు హాన్ నది కింద సముద్రగర్భ సొరంగం గుండా వెళుతుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి రైలులో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 22 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు.

మరో 129 మంది స్వల్ప గాయాలతో సంఘటన స్థలంలోనే చికిత్స పొందారు. ఈ ఘటనలో నిందితుడు కూడా తీవ్రంగా గాయపడటంతో.. అతనిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఈ అగ్నిప్రమాదంలో సబ్వే ట్రైన్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇందులో భాగంగా... ఆ నష్టం సుమారు 330 మిలియన్ డాలర్లు ఉండోచ్చని ది చోసన్ డైలీ తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన దర్యాప్తు అధికారులు.. తన విడాకుల కేసు ఫలితంపై నిరాశ చెంది వాన్ ఈ చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం జూన్ 9న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రాసిక్యూషన్‌ కు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

서울지하철 5호선 방화범 CCTV
사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH

— 브이몬 (@XXV_mon) June 25, 2025
Tags:    
  • SeoulSubwayFire 
  • SubwayIncident 
  • SeoulNews 
  • DivorceImpact 
  • PublicSafety 
  • SouthKorea 
  • TrainFire 
  • BreakingNews 
  • ViralVideo 

Similar News

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

2026-11-23 08:10 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

బిస్లరీ వాటర్‌లో రసాయనాలు.. పరీక్షల్లో బయటపడిన లోపాలు

2026-11-23 04:36 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

మార్కెట్లు పడిపోతుంటే డెమోక్రాట్లపై ట్రంప్ నిందలు.. అమెరికాలో కొత్త రాజకీయ రగడ!

2026-11-23 03:58 GMT

పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి.. టిలక్ వర్మ బ్యాటింగ్‌పై విమర్శలు!

2026-11-23 03:58 GMT

కీలక సమయాన తమ్మినేని సైలెంట్...రీజనేంటి ?

2026-11-23 03:58 GMT

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS