సంక్రాంతి జోష్ కు చెక్ పెట్టే వాయుగుండం లేటెస్ట్ అప్డేట్ ఇదే
డిసెంబరుతో ముగిసే క్యాలెండ్ ఇయర్ మాత్రమే కాదు.. భారీ వర్షాలకు సైతం చెక్ పడుతుందని చెబుతారు.;
డిసెంబరుతో ముగిసే క్యాలెండ్ ఇయర్ మాత్రమే కాదు.. భారీ వర్షాలకు సైతం చెక్ పడుతుందని చెబుతారు. చాలా తక్కువ సందర్భాల్లో ఏడాది ప్రారంభానికి తెర తీసే జనవరిలో వర్షాలకు అవకాశం ఉంటుంది. తెలుగోళ్లకు.. మరి ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి అతి పెద్ద పండుగైన సంక్రాంతి కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. అలాంటి పెద్ద పండుగ జోష్ ను దెబ్బ తీసేలా వాయుగుండం ఒకటి ఏపీ వైపు రావటం తెలిసిందే. వాతావరణ నిపుణుల అంచనాలకు భిన్నంగా బలపడని ఈ వాయుగుండం తాజాగా మాత్రం అందుకు భిననంగా తీవ్ర వాయుగుండంగా తన తీరును మార్చుకుంది.
ఈ తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారితే ఈ సంక్రాంతి జోష్ కు చెక్ పడినట్లే. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలో కేంద్రీక్రతమై ఉంది. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బలపడని ఈ వాయుగుండం ఈ రోజు (శనివారం) శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీరం దాటుందని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో ఆదివారం ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు. అదే సమయంలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లో (శని, ఆది) ఏపీతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలకు వీలుందని చెబుతున్నారు. ఈ వర్షాలు కంటిన్యూ అయితే సంక్రాంతి జోష్ ను దెబ్బ తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. ప్రకృతి ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.