• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తలాఖ్ కాదు.. ఖులా.....

తలాఖ్ కాదు.. ఖులా.. క్రీడా జంట విడాకుల్లో బిగ్ ట్విస్ట్

| కాగా, షోయబ్ కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతడి రాసలీలలు తెలిసి సానియా విడిపోయినట్లు స్పష్టమవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-01-21 09:03 GMT

ఆ జంట కలయిక క్రీడా ప్రపంచంలోనే కాదు.. మొత్తం ప్రపంచంలోనే సంచలనం.. పద్నాలుగేళ్లు సాగిన ఆ బంధం ఇప్పుడు తెగిపోవడం కూడా అంతే సంచలనంగా మారింది. ఇందులో అదొక్కటే కాదు.. అతడి రాసలీలలతో వేసారి ఆమెనే విడాకులు తీసుకుందనే చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి కూడా ధ్రువీకరించాడు. ఇంతకూ ఏం జరిగిందంటే..?

సానియానే విసిగిపోయిందా?

భారత టెన్నిస్ స్టార్, హైదారాబాదీ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడిపోయారనే వార్త ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. ఇందులో ఎవరు బాధ్యులు అన్నది అందరూ సెర్చ్ చేస్తున్నారు. సానియాతో విడిపోవడమే కాదు.. షోయబ్ మూడో వివాహం కూడా చేసుకున్నాడు. ఇది మరింత సంచలనం. అయితే, ముస్లిం సంప్రదాయం ప్రకారం షోయబ్ సానియాకు తలాఖ్ చెప్పాడా? లేదా? అనేది కూడా పరిశీలిస్తున్నారు. కానీ, ఈ జంట ఖులా ప్రకారం విడిపోయినట్లుగా సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపాడు. ఖులా అనేది ఇస్లామిక్ న్యాయశాస్త్రం, దీని ద్వారా స్త్రీ తన భర్త నుంచి ఏకపక్షంగా విడాకులు తీసుకోవచ్చు. తలాఖ్ ప్రకారం మాత్రం భర్త విడాకులు ఇస్తాడు. ఖులాలో సరైన కారణం చూపుతూ.. కోర్టును విడాకులు కోరుతుంది మహిళ. వివాహ బంధం నుంచి వైదొలగినందుకు ఖులాలో మహిళ భరణం కూడా కోరవచ్చు. కాగా, షోయబ్ కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతడి రాసలీలలు తెలిసి సానియా విడిపోయినట్లు స్పష్టమవుతోంది. తాజా పరిణామంపై షోయబ్ కుటుంబం చేసిన ప్రకటన కూడా దీనినే బలపరుస్తోంది.

కొన్ని నెలల కిందటనే విడాకులు..

షోయబ్-సానియా కొన్ని నెలల కిందటనే విడిపోయారని షోయబ్ కుటుంబం చెబుతోంది. దీనికి షోయబ్ కుటుంబం కూడా వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం. అంతేగాక.. పెళ్లికి వీరంతా దూరంగా ఉన్నట్లు తెలిసింది. 'సానియా వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ బయటపెట్టలేదు. పబ్లిక్ లైఫ్ నకూ దూరంగానే ఉంది. ఇప్పుడు.. షోయబ్‌ కొత్త ప్రయాణం బాగుండాలని సానియా శుభాకాంక్షలు తెలిపింది' అని సోషల్ మీడియాలో ప్రకటించింది. కాగా, షోయబ్-సానియా విడిపోవడం ఇవీ స్పష్టమైన కారణాలు ఇవి అని బయటకు రాలేదు. కాకపోతే.. మాలిక్‌ వివాహేతర సంబంధాల గురించి పాక్ మీడియాలో కథలు కథలుగా చెబుతున్నారు.

వదిన సానియాకు షోయబ్ సోదరీమణుల బాసట..

సానియా-షోయబ్ విడివడడం షోయబ్ సోదరీణమణులకూ ఇష్టం లేదట. మాలిక్ కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, సానియా-షోయబ్ ఏడాది కిందటనే విడిపోతారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వివాహం చేసుకున్న సనా జావేద్‌ కు షోయబ్ మాలిక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. తాజా పరిణామాలతో ఇప్పుడది వైరల్ అవుతోంది. గత ఏడాది షోయబ్ తన ఇన్‌స్టా హ్యాండిల్‌ లో రెండు స్నాప్‌ షాట్‌ లతో పాటు "హ్యాపీ బర్త్‌డే బడ్డీ" అంటూ సనాతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.

Tags:    
  • Saniamirza 
  • Shoaibmalik 
  • Divorce 
  • Marriage 
  • Affaires 
  • Socialmedia 
  • Starcouple 
  • Hyderabad 
  • Imranmirza 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS