2011, 2025 జూలై... జపాన్ ను వెంటాడుతోన్న 'ది ఫ్యూచర్ ఐ సా'!
రష్యాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా... మరోసారి జపాన్ లో మరోసారి సునామీకి సంబంధించిన భయాందోళనలకు గురైంది.;
రష్యాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా... మరోసారి జపాన్ లో మరోసారి సునామీకి సంబంధించిన భయాందోళనలకు గురైంది. ఈ సమయంలో.. జపాన్ తో పాటు, అమెరికాలోని కాలిఫోర్నియా, హవాయిలలో కూడా సునామీ విధ్వంసం మొదలైందని అంటున్నారు. అయితే... ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి చాలా కాలం క్రితం ఓ వ్యక్తి ఊహించడం గమనార్హం.
అవును... అవును... జపనీస్ 'బాబా వంగా' గురించి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. ఆమె అంచనాలు చాలా ఖచ్చితమైనవని ప్రజలు నమ్ముతారు. ఈ క్రమంలో... జూలైలో సునామీ వస్తుందని ఆమె కొన్ని నెలల కిందట హెచ్చరించినప్పుడు జపాన్ కు ప్రయాణించే ప్రజలు, పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఆ స్థాయిలో ఆమె అంచనాలను ప్రజలు నమ్ముతారు.
ఈ క్రమంలో.. జూలై 5న లేదా ఆ సమయంలో జపాన్ ను పెను సునామీ తాకే అవకాశం ఉందని రియో టాట్సుకి హెచ్చరించారు. ఆమెను బల్గేరియన్ ప్రవక్త బాబా వంగాతో పోల్చారు. 1980ల నుండి ఆమె ప్రపంచవ్యాప్తంగా విపత్తుల గురించి అంచనాలు వేస్తుంది. ఆమె వాటిని డైరీలో రాయడం ప్రారంభించింది.. ఈ క్రమంలో 1999లో 'ది ఫ్యూచర్ ఐ సా' అనే మాంగాను ప్రచురించింది.
2011లో ఖచ్చితమైన అంచనాలు!:
బాబా వంగా మాదిరిగానే జపాన్ కు చెందిన రియో టాట్సుకి కూడా గతంలో జపాన్ లో జరిగిన విపత్తుల గురించి ఖచ్చితమైన అంచనాలు వేసింది. 1999 లో ప్రచురితమైన 'ది ఫ్యూచర్ ఐ సా' లో ఆమె.. 2011 లో జపాన్ లో ఒక గొప్ప విపత్తును అంచనా వేశాడు. అయితే.. ఈ అంచనా నిజమైంది! 2011 లో ఒక భయంకరమైన సునామీ వచ్చింది.
జూలై 30న సునామీ తాకింది!:
టాట్సుకి రాసిన 'ది ఫ్యూచర్ ఐ సా' కొత్త వెర్షన్ 2021లో విడుదలైంది. దీనిలో.. జూలై 2025లో జపాన్ లో మళ్ళీ సునామీ వస్తుందని అంచనా వేశారు. ఈ అంచనా కారణంగా.. ప్రజలు ఈ సంవత్సరం జపాన్ కు వెళ్లే ప్రయాణాలను రద్దు చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పుడు జూలై 30న, జపాన్ లోని 16 ప్రదేశాలలో సునామీ అలలు ఎగసిపడుతున్నాయి.