ఆర్ఎస్ఎస్ అతి పెద్ద సంబరం....మోడీ వైపే అందరి చూపు !

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయి సరిగ్గా వందేళ్ళు అవుతోంది 1925 అక్టోబర్ 25 విజయదశం వేళ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది.;

Update: 2025-09-30 23:30 GMT

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయి సరిగ్గా వందేళ్ళు అవుతోంది 1925 అక్టోబర్ 25 విజయదశం వేళ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. ఆనాడు బ్రిటిష్ ఇండియాగా దేశం ఉంది. ఆర్ఎస్ఎస్ పుట్టిన మరో పాతికేళ్ళకు గానీ దేశానికి స్వాతంత్ర్యం రాలదు. ఇదిలా ఉంటే మహాత్మా గాంధీ 1915 తరువాత భారత దేశంలో స్వతంత్ర్య పోరాటం వైపు చూస్టారు. ఆయన పూర్తి యాక్టివ్ గా మారింది ఆ తరువాత కాలం అని చెబుతారు. అంటే ఒక వైపు మహాత్ముడు స్వరాజ్య ఉద్యమం తీవ్ర దశలో ఉండగా ఆర్ ఎస్ ఎస్ ఆవిర్భవించింది అన్న మాట.

ఆర్ఎస్ఎస్ కీలక ఘట్టం :

ఇక చూస్తే కనుక 1885లో ఏర్పాటు అయిన కాంగ్రెస్ అనే సంస్థ ద్వారానే అప్పటికి దేశంలో చురుకుగా స్వాతంత్ర్య పోరాటం సాగుతోంది. అయితే ఈ దశలో ప్రత్యేకించి మరో సంస్థ ఆవిర్భవించడానికి కారణాలు ఏమిటి అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఏమిటి అన్నది చరిత్రలోలో ఉంది. అదే విధంగా ఆ సమయంలో అనేక భావజాలాలతో సంస్థలు ఏర్పాటు అయ్యాయి కానీ ఏవీ తదనంతర కాలంలో పూర్తి జవసత్వాలతో కొనసాగలేక ఆగిపోయాయి. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం నాటి నుంచి నేటి దాకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తోంది.

ఇదీ నేపథ్యం :

ఆర్ఎస్ఎస్ 1925 లో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ స్థాపించారు. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ తన పాత్రను పెంచుకుంటూ పోయింది. అనేక భాగాలుగా శాఖలుగా విస్తరించి బ్రిటిష్ ఇండియాలో తదనంతర స్వతంత్ర్య దేశంలో తన వంతు పాత్రను పోషించింది. ఇక సేవా విద్యా రాజకీయ సాంస్కృతిక విభాగాలు ఆర్ఎస్ఎస్ లో కీలకంగా పనిచేస్తూ వచ్చాయి. అందులో రాజకీయ విభాగమే బీజేపీగా ఉంది. బీజేపీకి పూర్వం రూపం జనసంఘ్. అది 1953లో ప్రారంభం అయింది. 1977లో జనతా పార్టీగా మారినపుడు అందులో విలీనం అయింది అయితే 1980లో బీజేపీ ఏర్పాటు అయింది. దానికి తొలి అధ్యక్షుడుగా వాజ్ పేయ్ వ్యవహరించారు

అనేక సార్లు నిషేధం :

ఆర్ఎస్ఎస్ ని అనేక సార్లు దేశంలో నిషేధించారు. మొదటి సారి 1948 జనవరి 30న మహాత్మాగాంధీ హత్య తరువాత వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారు. ఆ తరువాత మరి కొన్ని సందర్భాల్లో అలాగే జరిగింది. అయితే నిషేధించినా కూడా ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఎక్కడా ఆగలేదు. అందుకే ఈ రోజు వందేళ్ల పండుగకు సిద్ధమైంది.

మేటి నాయకులు అంతా :

ఇక ఆర్ఎస్ఎస్ దేశానికి ఎంతో మంది నాయకులను అందించింది. అందులో ప్రముఖులు వాజ్ పేయి ఎల్ కే అద్వానీ, రాం నాథ్ కోవింద్, నరేంద్ర మోడీ, ఎం వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ వంటి వారు కనిపిస్తారు. వీరే కాదు బీజేపీలో ఉన్న వారిలో అత్యధిక శాతం ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారే అని చెప్పకతప్పదు అలా చూస్తే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రధానులను ఉప ప్రధానులను రాష్ట్రపతులను అందించింది అని స్పష్టం చేయాల్సి ఉంది.

ముఖ్య అతిధిగా మోడీ :

ఇక తిధి ప్రకారం ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండుగను చేసుకుంటున్నారు. అలా చూస్తే కనుక అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి దశమి వస్తోంది. దాంతో ఆ రోజున ఆర్ఎస్ఎస్ వందేళ్ళ వేడుకను ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ చారిత్రక ప్రయాణాన్ని తెలియచేసే స్మారక తపాల బిళ్ళతో పాటు నాణేలను విడుదల చేస్తారు. అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు. దాంతో ప్రధాని మోడీ ఏమి మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఎపుడో ఒక చిన్న సంస్థగా ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ వందేళ్ల సుదీర్ఘ ప్రస్థానంగా ముందుకు సాగడం ఈ శతాబ్ది ఉత్సవాలు నాటికి దేశంలో బీజేపీ అధికారంలో ఉండడం ఆ సంస్థ సాధించిన గొప్ప విజయంగానే అంతా చూస్తున్నారు.

Tags:    

Similar News