మీ కుటుంబం బిచ్చమెత్తుకోవాల్సిందే.. బీఆర్ఎస్ పై రేవంత్ మార్క్ డైలాగ్ వార్
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై మరోసారి హై-వోల్టేజ్ సినిమా నడుస్తోంది. మొన్నటివరకు కాస్త సైలెంట్‌గా ఉన్న గులాబీ-హస్తం ఫైట్.. ఇప్పుడు ఒక్కసారిగా క్లైమాక్స్ రేంజ్‌కి చేరింది.
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై మరోసారి హై-వోల్టేజ్ సినిమా నడుస్తోంది. మొన్నటివరకు కాస్త సైలెంట్‌గా ఉన్న గులాబీ-హస్తం ఫైట్.. ఇప్పుడు ఒక్కసారిగా క్లైమాక్స్ రేంజ్‌కి చేరింది. ఘట్‌కేసర్‌లో కవి అందెశ్రీ స్మృతివనం భూమిపూజ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వేదికను కాస్తా పొలిటికల్ అఖాడాగా మార్చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆయన వదిలిన శరపరంపర ఇప్పుడు సోషల్ మీడియాలో.. టీవీ డిబేట్లలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ ఫామ్‌హౌస్‌లు.. ఈ డైలాగులు!
సినిమాల్లో విలన్‌ను హీరో హెచ్చరించినట్లు.. "నేను ఉన్నంతవరకు మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రానివ్వను" అని రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అంతటితో ఆగితే ఆయన రేవంత్ ఎందుకవుతారు? "మీ కుటుంబం బిచ్చమెత్తుకుని బతకాల్సి వస్తుంది" అంటూ నెక్స్ట్ లెవెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాం రాజులను మించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితల ఫామ్‌హౌస్‌లు ఎలా పెరిగాయో చెప్పాలంటూ.. తెలంగాణ సమాజం ఇచ్చిన అవకాశాలతో సంపాదించిన ఆస్తుల లెక్కలపైనా సెటైర్లు వేశారు.
"నోటిఫికేషన్లు మీవి.. ఉద్యోగాలు మావి" కాన్సెప్ట్ ఏంటి బాసూ?
ఇక నిరుద్యోగుల ఇష్యూపై బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్‌కు రేవంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు "నోటిఫికేషన్లు కేసీఆర్ ఇచ్చారు.. ఉద్యోగాలు కాంగ్రెస్ ఇస్తోంది" అని చెప్పుకోవడంపై మండిపడ్డారు. "ఇదేం విడ్డూరం? నోటిఫికేషన్లు ఇస్తే సరిపోయిందా.. పరీక్షలు సక్కగా పెట్టారా? మేం వచ్చి ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, అభ్యర్థుల తల్లిదండ్రుల సమక్షంలో లెటర్స్ ఇస్తుంటే.. క్రెడిట్ మాత్రం మీ ఖాతాలో వేసుకుంటారా?" అంటూ ఈ పొలిటికల్ క్రెడిట్ గేమ్స్ పై చురకలు అంటించారు.
కవులు గుర్తున్నారు.. రాజకీయం పండింది
ఉద్యమ సమయంలో దొరల గడీల ముందు మోకరిల్లని ధైర్యశాలి అందెశ్రీ అని కొనియాడుతూనే.. గత ప్రభుత్వంలో అందెశ్రీ, గద్దర్ లాంటి ప్రజా కవులకు జరిగిన అవమానాలను రేవంత్ గుర్తుచేశారు. ఆ అసంతృప్తే బీఆర్ఎస్‌ను సాగనంపిందని, మళ్లీ తెలంగాణను దోచుకోవాలని చూస్తే అందెశ్రీ పాటలే ప్రజలను చైతన్యపరుస్తాయని సెలవిచ్చారు.
మొత్తానికి సాహిత్య కార్యక్రమాన్ని కాస్తా ఫుల్-లెంగ్త్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్‌తో రేవంత్ రెడ్డి నింపేశారు. మరి ఈ 'బిచ్చమెత్తుకునే' కామెంట్లపై గులాబీ బాస్ ఫామ్‌హౌస్ నుంచి ఎలాంటి కౌంటర్ ఎటాక్ రాబోతోంది? కేటీఆర్, హరీష్ రావులు ఏ రేంజ్‌లో తిప్పికొడతారు? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాస్‌లు.. పిక్చర్ ఇంకా బాకీ హై...