సీఎం రేవంత్ తో సల్మాన్ ఖాన్.. ఏంటి కథ? వైరల్ వీడియో
సీఎం రేవంత్, సల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడలు, యువతను ప్రోత్సహించడంలో ముందుంటున్నాడు. గత ప్రభుత్వాలకు భిన్నంగా యువతకు పెద్దపీట వేస్తున్నాడు. నూతన క్రీడలకు మద్దతు తెలుపడంలో ఎప్పుడూ ముందుంటున్నాడు. పౌర కార్యక్రమాలలో ఆయన చురుకైన భాగస్వామ్యం.. ప్రజలతో మమేకం అయ్యే తీరు మరోసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది.
తాజాగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని గచ్చి బౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీజన్ 2ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ క్రాస్ రేసింగ్ లోని థ్రిల్, ఎనర్జీని కళ్లారా చూసి ఫిదా అయ్యారు.
ఈ వేడుకలో అత్యంత ఆసక్తికర అంశం ఏంటంటే.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఈ కలయిక సినీ, రాజకీయ, క్రీడా ప్రేమికులకు కనువిందు చేసింది. ఈ ప్రారంభోత్సవ వేదికపై సీఎం రేవంత్, సల్మాన్ ఖాన్ తో కలిసి కనిపించడం.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం.. కరచాలనం చేసుకోవడం.. కాసేపు సరదాగా సంభించుకోవడం ఈవెంట్ కే హైలెట్ గా నిలిచింది.
సీఎం రేవంత్, సల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యువ క్రీడాకారులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని.. యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరై సందడి చేశారు.
ఇక సీఎం రేవంత్, హీరో సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై కనిపించి ఆహ్లాదంగా కనిపించడం వైరల్ అయ్యింది. ఆ ఫొటోలు, వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. హైదరాబాద్ లో మోటార్ స్పోర్ట్స్ రంగం ప్రాముఖ్యతను ఈ ఈవెంట్ పెంచినట్టైంది.