• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉస్మా‘నయా’.. ఆస్పత్రి...

ఉస్మా‘నయా’.. ఆస్పత్రి కాదు.. అంతకుమించి.. ఫైవ్ స్టార్ రేంజ్

| నిమ్స్, గాంధీ కంటే పురాతనమైన ఉస్మానియా ఆస్పత్రికి వందేళ్ల చరిత్ర ఉంది. 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ఆస్పత్రిని కట్టించారు.

By - Tupaki Desk
Update: 2025-01-31 13:30 GMT

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కే కాదు.. వైద్యానికి కూడా హైదరాబాద్ రాజధాని. పేదలు, మధ్య తరగతి ప్రజలు మెరుగైన చికిత్స కోసం చూసేది హైదరాబాద్ వైపే.. ఒక్క తెలంగాణకే కాదు.. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా హైదరాబాద్ కు వస్తుంటారు. మహా నగరంలో ప్రభుత్వ పరంగా ఉన్న వైద్యశాలలు నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), గాంధీ (సికింద్రాబాద్), ఉస్మానియా (కోఠి)... ఈ మూడు ప్రఖ్యాత ఆస్పత్రులు దశాబ్దాలుగా లక్షల మందికి వైద్యం అందించాయి.. ఇంకా లక్షల మంది ప్రాణాలు నిలుపుతున్నాయి.


వందేళ్లపైగా..

నిమ్స్, గాంధీ కంటే పురాతనమైన ఉస్మానియా ఆస్పత్రికి వందేళ్ల చరిత్ర ఉంది. 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ఆస్పత్రిని కట్టించారు. 22 విభాగాల్లో వైద్యం అందుతుండగా.. 1096 పడకలు ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్‌, స్కిన్ బ్యాంక్, డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్, ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ తో పాటు కాలిన గాయాలకు మెరుగైన చికిత్సకు ఉస్మానియా పెట్టింది పేరు. 2 వేల మందిపైగా ఓపీ సేవలు పొందుతున్నారంటేనే దీని సేవలను అర్థం చేసుకోవచ్చు. కాగా, ఉస్మానియాలో అతిపెద్ద సమస్య పడకల కొరత. పైగా 105 ఏళ్ల నాటి భవనం కావడంతో కూలే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆస్పత్రి నిర్మాణం తలపెట్టారు. దీనిని సాదాసీదాగా కాకుండా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.

మరో వందేళ్లు మన్నేలా..

ఉస్మానియా కొత్త ఆస్పత్రిని గోషామహల్‌ లో దాదాపు 3 ఎకరాల్లో 14 అంతస్తులతో చేపడుతున్నారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కొత్త ఆస్పత్రి నిర్మాణ వ్యయం రూ.2,075 కోట్లు. కోఠిలోని పాత ఆస్పత్రిలో వెయ్యి పడకలే ఉండగా.. కొత్తదాంట్లో 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. 22 విభాగాలకు తోడు మరో 8 చేరుస్తున్నరు.

2 ఫ్లోర్లలో పార్కింగ్, రోజుకు 3 నుంచి 5 వేల మందికి సేవలు అందించేందుకు గ్రౌండ్ ఫ్లోర్‌ లో ఓపీ కౌంటర్లు, అన్ని విభాగాల వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా పక్కా ప్లానింగ్ తో చేపడుతున్న కొత్త ఆస్పత్రి నిర్మాణంలో గదుల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడనున్నారు. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్లు ప్రత్యేకం. అవయవ మార్పిడికి అత్యాధునిక థియేటర్లు సిద్ధం చేస్తున్నారు. 2026-27 నాటికి కొత్త ఉస్మానియా ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.

విశాల రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ అంబులెన్స్ కు హెలీ ప్యాడ్స్, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ల కోసం సెమినార్ హాల్‌ తదితర అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

Tags:    
  • Revanthreddy 
  • Telanganagovernment 
  • Osmaniahospital 
  • Hyderabad 
  • Congress 
  • Brs 
  • Bjp 
  • Governmenthospital 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS