బీఆర్ ఎస్.. ఉద్యోగాలు ఇవ్వ‌లేదు.. అమ్ముకుంది: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో మైనారిటీల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అండ‌గా ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సెక్యుల‌ర్ పార్టీగా కాంగ్రెస్ ఎప్పుడూ.. అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

Update: 2026-08-13 18:04 GMT

రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం ఏదైనా ఉంటే అది త‌మ‌దేన‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు. త‌మ ప్ర‌భుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చింద‌ని చెప్పారు. అలాగే గ్రూప్‌-1 పోస్టుల‌ను కూడా పార‌ద ర్శ‌కంగా ఇస్తోంద‌ని తెలిపారు. ఇప్పుడు త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న బీఆర్ ఎస్ వారు.. గ‌త ప్ర‌భుత్వంలో ఉద్యోగా లు ఇవ్వ‌లేద‌ని.. ప‌ల్లీలు, బ‌ఠానీల మాదిరిగా వెల క‌ట్టి అమ్ముకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎవ‌రిది ఫ్రెండ్లీ ప్ర‌భుత్వ మో.. ఎవ‌రు ఉద్యోగాలు ఇచ్చారో.. ఉద్యోగుల‌ను అడిగితే చెబుతార‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మైనారిటీల‌కు అండ‌

రాష్ట్రంలో మైనారిటీల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అండ‌గా ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సెక్యుల‌ర్ పార్టీగా కాంగ్రెస్ ఎప్పుడూ.. అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. గ‌తంలో 4 శాతం ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ తీసుకువ‌చ్చిన ఏకైక ప్ర‌భుత్వం కూడా కాంగ్రెస్ స‌ర్కారేన‌నిచెప్పారు. కానీ, దానిపై కొంద‌రు కోర్టుకు వెళ్లి నానా యాగీ చేశార‌ని విమ‌ర్శించారు. అదే వ‌ర్గం.. గుజ‌రాత్‌లో మాత్రం మైనారిటీల‌కు మేలు చేస్తోంద‌ని ప‌రోక్షంగా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అక్క‌డ ఎందుకు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేయ‌డం లేద‌న్నారు.

లౌకిక వాద‌, ఉదార‌వాద‌, సామ్య‌వాద ప్ర‌భుత్వాల‌కు కాంగ్రెస్ పెట్ట‌ని కోట‌గా రేవంత్ అభివ‌ర్ణించారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల‌కు మేలు చేసేలా కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌న్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో అన్ని వ‌ర్గాల మ‌హిళ‌లు ఉచితం గా ప్ర‌యాణిస్తున్నార‌ని తెలిపారు. అలానే.. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటును కూడా కులాలు, మ‌తాల‌కు అతీతంగా అంద‌రికీ అందిస్తున్నామ‌న్నారు. కానీ, విద్యార్థులు బాగా చ‌దువుకోకూడ‌ద‌ని.. చ‌దువుకుంటే.. త‌మ‌కు అనుకూలం గా ఉండ‌ర‌ని కొంద‌రు భావిస్తున్నారు. అందుకే.. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటును వంద‌ల కోట్ల రూపాయ‌లు పెండింగు లో ఉంచిపోయారు.. అన్నారు.

``కాంగ్రెస్ పార్టీకి అన్నివ‌ర్గాలు కావాలి.. అన్ని వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ కావాలి`` అన్న‌దే త‌మ నినాద‌మ‌ని చెప్పారు. అందుకే ఈ దేశంలో సెక్యుల‌ర్ వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ అన్ని స‌మ‌యాల్లోనూ అండ‌గా నిలిచింద‌ని రేవంత్ తెలిపారు. హిందూ, ముస్లింలను రెండు కళ్లలా చూసే పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మేన‌ని ఉద్ఘాటించారు. ఈ మేర‌కు మైనారిటీల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఎక్స్‌లెన్స్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు.

Tags:    

Similar News