రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైమ్: ఇచ్చిన 'పురస్కారాన్ని' వెనక్కి తీసుకున్నారు
ఈ నిర్ణయం తక్షణమే అమలు చేయాలంటూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆదేశించారు. వాస్తవానికి రాయ్.. ప్రస్తుత బీజేపీలోనే ఉన్నారు.
ఇచ్చిన పురస్కారం.. చేసిన సత్కారం.. రెండింటినీ వెనక్కి తీసుకోకూడదని అంటారు. అయితే.. అనూహ్య పరిస్థి తులు. .రాజకీయ దుమారాల నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర పరిధిలోని పురస్కారాన్ని ఇచ్చి.. వెనక్కి తీసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అదికూడా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవి కావడం.. కోటి రూపాయల నజరానా కూడా ఉండడం గమనార్హం. ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఏం జరిగింది?
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మక అవార్డు కింద.. `బంగ విభూషణ్` పురస్కారాన్ని అందిస్తుంది. దీని ఎంపికే అత్యంత కఠినం. గత 15 సంవత్సరాలుగా దీనిని అందిస్తున్నారు. సామాజిక సేవ, ప్రజల అభ్యున్నతి, సేవా తత్పరత.. ఇలా అనేక కోణాల్లో పురస్కార గ్రహీతలను ఎంపిక చేసి.. వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఇది రాష్ట్రస్థాయిలో అత్యున్నత పౌర పురస్కారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సామాజిక వేత్త.. నాగేంద్ర రాయ్‌కు ఈ పురస్కారాన్ని అందించారు.
అయితే.. ఈ పురస్కారాన్ని తక్షణమే రద్దు చేస్తూ.. సీఎం సువేందు అధికారి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు.. ఆయ నకు పురస్కార పత్రంతోపాటు ఇచ్చిన నగదు బహుమతిని కూడా వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలు చేయాలంటూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆదేశించారు. వాస్తవానికి రాయ్.. ప్రస్తుత బీజేపీలోనే ఉన్నారు. రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్‌లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. అలాంటప్పుడు.. ఆయనకు ఇచ్చిన పురస్కారాన్ని ఎందుకువెనక్కి తీసుకున్నారన్నది కీలక అంశం.
ఎందుకంటే..
పశ్చిమ బెంగాల్ ప్రజలతోపాటు.. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్‌లు ఎంతో ముఖ్య నాయకుడిగా కొలిచే సుభాష్‌చంద్రబోస్‌ను రాయ్ అవమానించారు. బుధవారం ఆయన ఓ చోట మాట్లాడుతూ.. దేశ ద్రోహిగా, యుద్ధ నేరస్తుడిగా కూడా అభివ ర్ణించారు. దీంతో ఈ వ్యవహారం తృణమూల్ కాంగ్రెస్‌కు అందివచ్చిన వరంగా మారింది. దీంతో సుభాష్ చంద్రబో స్‌ను అవమానించారంటూ.. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో అలెర్ట్ అయిన సీఎం సువేందు.. బీజేపీ సభ్యుడే అయినప్పటికీ రాయ్‌కు ఇచ్చి అత్యున్నత పౌర పురస్కారాన్ని వెనక్కి తీసుకుం టూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని మీడియా పేర్కొంది.