కేసీఆర్ అన్నంపెట్టిండు..: పోచారం షాకింగ్ కామెంట్స్
కానీ, ఇటీవల మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి మాత్రమే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇస్తున్నారని.. భజన రాయుళ్లు పెరిగిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో బీఆర్ ఎస్ తరఫున విజయం సాధించిన పోచా రం.. తర్వాత రేవంత్ పంచన చేరిపోయారు. అయితే. ఆయన మంత్రి పీఠం కోసమే పార్టీ మారారన్న చర్చ ఉంది. కానీ, అనూహ్యంగా జంపింగులకు పదవులు ఇచ్చేది లేదని రేవంత్ స్పష్టం చేసేశారు. దీంతో పోచారం హర్టయ్యారు. అయినా.. పార్టీ మారిపోయిన నేపథ్యంలో కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు.
కానీ, ఇటీవల మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి మాత్రమే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇస్తున్నారని.. భజన రాయుళ్లు పెరిగిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను భజన చేయలేనని.. ప్రజల కోసమే పనిచేస్తానని కూడా చెప్పారు. ఇది పరోక్షంగా సీఎం రేవంత్‌ను ఉద్దేశించే శ్రీనివా సరెడ్డి వ్యాఖ్యానించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అంతేకాదు.. కేసీఆర్ బాగా చేసిండు.. అని అప్పట్లో కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకువ చ్చాయి.
కేసీఆర్ పాలన నచ్చకనే తాను బయటకు వచ్చానని గతంలో చెప్పిన పోచారం.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రధా నంగా ఆయన వైఖరిని చాటి చెప్పాయి. ఇక, తాజాగా కూడా ఎక్కడా వెనక్కితగ్గలేదు. వర్ని మండలం జాకోరా గ్రామంలో పర్యటించిన పోచారం.. ``నేను రేవంత్‌ను తిట్టిన్నని.. కేసీఆర్‌ను పొగిడిన్నని అంటున్నరు. కానీ, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన`` అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో స్వార్థం తనకు లేదన్నారు. కేసీఆర్ అన్నం పెట్టాడు కాబట్టి.. ఆయనను మరిచిపోయే ప్రసక్తి లేదన్నారు. అలాగని.. నేనేమీ లేనివి ప్రచారం చేయడం లేదన్నారు.
సీఎం రేవంత్ కూడా అభివృద్ధి చేస్తే.. అలానే చెబుతానని పోచారం వ్యాఖ్యానించారు. తాను కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. అంతకుమించి తనకు ఎవరి ప్రాపకం కోసం పనిచేయాల్సిన అవసరం లేద న్నారు. అభివృద్ధికోసమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని.. అంతకుమించి ఏమీ ఆశించడం లేదని పోచారం చెప్పడం గమనార్హం. కాగా.. బాన్సువాడకు ఇటీవల ప్రభుత్వం నిధులు మంజురు చేసింది. దీంతో గురువారం ఆయన పనులుప్రారంభించారు.