బీజేపీ బీఆర్ఎస్ పొత్తు...2028 లో పోటీ...నిజమేనా ?
తెలంగాణా రాజకీయాల్లో సంచలనమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా.
తెలంగాణా రాజకీయాల్లో సంచలనమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా. ఇప్పటిదాకా చూస్తే తెలంగాణా ఆవిర్భవించాక బహుముఖ పోటీలు చతుర్ముఖ త్రిముఖ పోటీలు జరిగాయి. కానీ ముఖాముఖి పోటీ అన్నది జరగలేదు. దాని వల్ల పొలిటికల్ అడ్వాంటేజ్ ఒకసారి బీఆర్ఎస్ కి మరోసారి కాంగ్రెస్ కి దక్కింది. అయితే ఈసారి అలాంటి సానుకూలతకు తావు ఇవ్వకుండా ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా ముఖా ముఖీకి రంగం సిద్ధం అవుతోందా అన్న చర్చ సాగుతోంది. చాలా కాలంగా వినిపిస్తున్న మాట 2028 ఎన్నికల్లో నిజం అవుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. బీజేపీ బీఅర్ఎస్ కలసి పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగుతాయా అన్నది కూడా బిగ్ డిబేట్ గా మారుతోంది.
రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ :
ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీకి వచ్చే ఎన్నికల్లో దిగుతాయని తనకు సమాచారం ఉంది అని చెప్పారు. అయితే తనకు సమాచారం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అన్నది తాను బయటపెట్టలేనని ఆయన తాజాగా మాట్లాడుతూ చెప్పారు. అది నైతికత కాదని అన్నారు. అయితే ఆ రెండు పార్టీలు పోటీ చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి బల్ల గుద్దుతున్నారు. దానికి అనేక ఉదాహరణలను కూడా ఆయన ముందు పెడుతున్నారు.
సీబీఐ ఎందుకు వేయరు :
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అవినీతి మీద ప్రాథమిక ఆధారాలతో రెండు కేసులను సీబీఐకి ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఆ కేసులపై కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి ఎందుకు ఎక్కడ జాప్యం అవుతోంది ఎందుకు సీబీఐ వేయరని ఆయన ప్రశ్నించారు. ఇక తమ ప్రభుత్వం సేకరించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆయన కిషన్ రెడ్డిని కోరారు. మరో వైపు చూస్తే తాను 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు ప్రజలకు మేలు చేసేందుకు తాను రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతాను అన్నారు. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తానూ ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ని నడిపిస్తున్నామని తాము 2028 ఎన్నికల్లోనూ గెలిచి వస్తామమి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హరీష్ బీజేపీలోకి :
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మరో కీలక ఆరోపణ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్ర నేత హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారు అని అన్నారు. దానికి సంబంధించి ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో అంతా తనకు తెలుసు అన్నారు. హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేయకపోతే కేసీఆర్ మీద ఒట్టు పెట్టి చెప్పాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే దాని మీద హరీష్ రావు అయితే ఖండించారు. తన రాజకీయ పుట్టుక బీఆర్ఎస్ లో జరిగిందని తాను జీవించినంత కాలం అందులోనే కొనసాగుతాను అన్నారు.