రిలేషన్‌షిప్ లో ఎవరికీ సహనం ఉండట్లేదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా, ఆద్య బాధ్యతని తీసుకుని వారిని పెంచుతూ జీవితాన్ని గడుపుతున్న రేణూ దేశాయ్ ప్రతీ విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంటుంది.
రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ పలు వ్యక్తిగత విషయాలతో పాటూ ప్రెజెంట్ జెనరేషన్ రిలేషన్‌షిప్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ రోజుల్లో ఎవరికీ సహనం లేకుండా పోయిందని, 1% కూడా సహనం ఉండట్లేదని, వాస్తవానికి తాను ఈ విషయం గురించి మాట్లాడకూడదనుకుంటున్నానని, ఏమైనా మాట్లాడితే మీరెందుకు మాట్లాడుతున్నారు? పెళ్లైపోయి విడాకులు తీసుకున్నానంటారని అంటోంది రేణూ.
పెళ్లిలో ఓ గొప్ప సంస్కృతి ఉందని, ఆ సంప్రాదాయాన్ని అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ అర్థం చేసుకోవాలని, పెళ్లి చాలా గొప్పదని, అందరూ ఆడ, మగ సమానమంటారు కానీ అసలు సమానం కాదని, ఆడవాళ్ల గొప్ప ఆడవాళ్లదేనని, మగవాళ్ల గొప్ప మగవాళ్లదేనని, ఇద్దరూ ఎప్పటికీ సమానం కాదని రేణూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది.
ఆడవాళ్ల పని సున్నితంగా ఉంటూ ఇంటిని చక్కబెట్టుకుంటూ మంచి వంట చేసుకుని అన్నీ సక్రమంగా చూసుకోవడం అయితే, మగవాడి పని బయటికెళ్లి యుద్ధం చేసైనా సరే డబ్బు సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవడమని, ఈ రెండూ సరిగ్గా జరిగితే అంతా సక్రమంగా జరిగి లైఫ్ చాలా బావుంటుందని తెలిపింది రేణూ.
ఇప్పుడు జెనరేషన్ మారింది కానీ పెళ్లి పైన అందరికీ సరైన అవగాహన రావడం లేదని, తనకు తెలిసిన ఎంతో మంది మంచి మగాళ్లు కూడా ఉన్నారని, వారంతా పెళ్లి చేసుకుని సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారని రేణూ తెలిపింది. ఇదే ఇంటర్వ్యూలో రెండో పెళ్లి గురించి కూడా రేణూ మాట్లాడింది. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే అవడంతో రెండో పెళ్లి చేసుకుంటే రిలేషన్‌షిప్‌కీ, పిల్లలకీ సరైన టైమ్ ను కేటాయించలేననే భయంతోనే ఆ ఆలోచనను విరమించుకున్నానని, ప్రస్తుతం ఆద్యకు 15 సంవత్సరాలనీ, తనకు 18 ఏళ్లు నిండాక రెండో పెళ్లి ఆలోచన చేస్తానేమో అని రేణూ తెలిపింది.