ఎర్రబెల్లి.. సత్యవతిలపై గులాబీ ఎమ్మెల్సీ షాకింగ్ వ్యాఖ్యలు!

గులాబీ సీనియర్ నేతలు.. మాజీ మంత్రులైన ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్.

Update: 2023-12-16 04:20 GMT

గులాబీ సీనియర్ నేతలు.. మాజీ మంత్రులైన ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్. తాజాగా ఆయన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు.. సత్యవతి రాథోడ్ లను మాటలతో ఉతికేశారు. వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారన్న ఆయన.. తెలంగాణ వాదం.. తెలంగాణ ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలా? అని ప్రశ్నించటం గమనార్హం.

మాజీ మంత్రులపై సీరియస్ కామెంట్లు చేసిన ఆయన.. గులాబీ బాస్ కేసీఆర్ ను సైతం వదల్లేదు. ‘‘అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారు. వాస్తవాలు చెప్పే వారు బయట.. జోకుడుగాళ్లు లోపల ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి?’’ అంటూ మండిపడ్డారు. ఎర్రబెల్లిని మంచి లీడర్ అని ఎవరైనా అంటే.. అక్కడి ప్రజలు ఉరికించి కొడతారన్న ఆయన.. ఎర్రబెల్లి చక్కిలి గింతలు పెట్టటం తప్ప.. ఎవరికీ రూపాయి సాయం చేయరన్నారు.

కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారన్న ఆయన.. వరంగల్ జిల్లాకు చెందిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదన్నారు. ‘‘కుక్కలు కూడా వారి వెంట పడవు’’ అంటూ గులాబీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అంతేకాదు.. మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ చేసే తప్పుల్ని విడిచిపెట్టకుండా చేసిన ఆయన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘‘ఖమ్మంలో ప్రతిసారి బయట గెలిచిన వారని పార్టీలోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపోయారు. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల సహనానికి పరీక్ష పెట్టారు’’ అంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా మాటలతో ఇంతలా విరుచుకుపడిన ఎమ్మల్సీపై గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News