కూతురితో ఫెరారీ రైడ్ కి వెళ్లిన గ్లోబల్ స్టార్.. వీడియో వైరల్!

అయితే క్లీంకారా పుట్టి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటి వరకు ఆమె ఫేస్ ని రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ. అప్పుడప్పుడు ఆమె ఫేస్ కాస్త అటూ ఇటూగా కనిపించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి.;

Update: 2025-08-07 12:50 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన కూతురితో కలిసి జూబ్లీహిల్స్ వీధుల్లో కార్ లో తిరిగిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి క్లీంకారా పేరు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారిపోయింది. విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా జూబ్లీహిల్స్ లో తన కూతురుతో కలిసి ఫెరారీ కార్ లో తిరిగిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక రామ్ చరణ్ క్లీంకారా ఇద్దరు కలిసి తిరిగిన ఆ ఫెరారీ కార్ ధర దాదాపు రూ.3.5 కోట్లు. అలా కూతురితో కలిసి జూబ్లీహిల్స్ వీధుల్లో రామ్ చరణ్ రెడ్ కలర్ ఫెరారీ కార్ లో తిరిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

క్లీంకారా విషయానికి వస్తే.. ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు 2023 జూన్ 20న క్లీంకారా జన్మించింది. పెళ్లయిన దశాబ్ద కాలం తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరెంట్స్ అవ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే పెళ్లయ్యాక పిల్లల గురించి ముందే ప్లాన్ చేసుకున్న ఈ జంట ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా పట్టించుకోకుండా తమ లైఫ్ ఏంటో తాము చూసుకున్నారు. క్లీంకారా పుట్టాక మెగా ఫ్యామిలీలో ఎన్నో శుభకార్యాలు జరిగాయి.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో పాటు రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.అంతేకాదు అటు పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి డీసీఎంగా బాధ్యతలు చేపట్టారు. వరుణ్ తేజ్ కూడా తాను ఇష్టపడ్డ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేశారు. ఇలా ఒక రకంగా క్లీంకారా మెగా ఫ్యామిలీకి అదృష్టం అని చెప్పుకోవచ్చు.

అయితే క్లీంకారా పుట్టి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటి వరకు ఆమె ఫేస్ ని రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ. అప్పుడప్పుడు ఆమె ఫేస్ కాస్త అటూ ఇటూగా కనిపించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ క్లియర్ కట్ గా అయితే ఫేస్ ని చూపెట్టలేదు. అటు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో నాన్న అని నా కూతురు ఎప్పుడైతే పిలుస్తుందో అప్పుడే క్లీంకారా ఫేస్ ని రివీల్ చేస్తాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు..

ఈ విషయం పక్కన పెడితే.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో 'పెద్ది' అనే మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News