చైనాని చూసి మోడీ... రాహుల్ విమర్శల వెనక ?

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు అన్నది తెలిసిందే.;

Update: 2025-10-03 03:41 GMT

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు అన్నది తెలిసిందే. ఆయన పార్లమెంట్ లోపలా వెలుపలా బీజేపీని టార్గెట్ చేస్తారు. అయితే ఆయన దేశం విడిచి బయటకు వెళ్ళినా కూడా అక్కడ నుంచి బీజేపీని మోడీని విమర్శించడం చర్చనీయాంశంగా ఉంది. దీంతో విదేశీ గడ్డ మీద నుంచి సొంత దేశాన్ని రాహుల్ ఎలా విమర్శిస్తారు అని బీజేపీ కౌంటర్లు వేస్తోంది.

ప్రజాస్వామ్య పునాదులపైన :

ఇదిలా ఉంటే కొలంబియాలోని ఎన్విగాడోలో ఉన్న ఈఐఏ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ తాజాగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం భారత్ దేశంలో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ లాంటి విభిన్న సమాజం ఉన్న దేశానికి సరిపడని విధానాలు అమలు అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

అతి పెద్ద ముప్పుగా :

ఈ రోజున భారత్ కి అతి పెద్ద ముప్పు ఈ దాడులే అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల మీదనే ఈ దాడులు జరగడం ఆక్షేపణీయం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం బలం అన్నది భిన్నత్వంలోనే ఉందని రాహుల్ అన్నారు. ఎన్నో మతాలు భాషలు సంప్రదాయాలు భారత్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజాస్వామ్యం అనే ఒక చట్రంలో ఇమిడి ఉంటున్నాయని ఇపుడు ఆ చట్రానికే ముప్పు ఏర్పడింది అని ఆయన అన్నారు.

నియంతృత్వం కూడదు :

భారత దేశంలో నియంత పోకడలకు ఎక్కడా తావు లేదని రాహుల్ గాంధీ అన్నారు. భారత సహజ స్వభావానికి ఇవి సరిపడవని చెప్పారు. చైనా కేంద్రీకృతమైన విధానాలు కలిగిన దేశమని భారత్ వికేంద్రీకరణ దేశమని రాహుల్ ఈ సందర్భంగా పోల్చారు. ప్రజలను అణచివేస్తామంటే కుదరదని ఆయన పేర్కొంటూ అలాంటి ప్రయత్నాలు ఏమి చేఇనా విఫలం అవుతాయని ఆయన హెచ్చరించారు. భారత దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆయన చెప్పడం విశేషం.

బీజేపీ కౌంటర్ :

రాహుల్ గాంధీ ఎపుడూ విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచే భారత్ ని విమర్శిస్తారని ఇది ఆయనకు ఒక అలవాటుగా మారింది అని బీజేపీ విమర్శించింది. రాహుల్ వైఖరి సబబు కాదని నిందించింది ఆయన ఎప్పటికీ తన తీరుని మార్చుకోరని కూడా మండిపడింది. మొత్తానికి విదేశీ గడ్డ మీద నుంచి మోడీని బీజేపీని రాహుల్ ఎండగడుతున్న తీరు మరో మారు చర్చకు దారి తీస్తోంది.

Tags:    

Similar News