మోడీ ప్రధాని అయ్యేవారు కాదా ...రాహుల్ హాట్ కామెంట్స్ ?
కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆయన విమర్శల పరంపర కొనసాగుతూ వస్తోంది.;
కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆయన విమర్శల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఓట్లను చోరీ చేస్తున్నారు అని ఆయన తీవ్రమైన ఆరోపణలే సంధిస్తున్నారు. మరో వైపు చూస్తే రాహుల్ గాంధీ ప్రధాని మోడీని కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అదే కనుక జరిగితే ఆయనకు మూడో చాన్స్ లేకుండా పోయేదని కూడా చెబుతున్నారు
మోడీకి హ్యాట్రిక్ చాన్స్ మిస్ అట :
రాహుల్ గాంధీ దృష్టిలో 2024 ఎన్నికల్లో బీజేపీది నిజమైన గెలుపు కానే కాదుట. అంతే కాదు కాస్తా తేడా వస్తే ఏకంగా నరేంద్ర మోడీ ప్రధాని కూడా అయ్యేవారు కారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పదిహేను ఎంపీ సీట్లు తగ్గి ఉంటే 2024 లో మోడీ ప్రధాని అభ్యర్ధిగా ఎన్డీయే నుంచి ఉండేవారు కారు అన్నది రాహుల్ మాటాల సారాంశంగా ఉంది.
ఆ నంబర్ చాలా దూరం :
ఇక 2024 ఎన్నికలు చూసుకుంటే బీజేపీకి 240 దాకా మాత్రమే సొంతంగా ఎంపీ సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కి ముప్పయికి పైగా సీట్ల దూరంలో ఆ పార్టీ ఉంది. అయితే ఈ నంబర్ లో కూడా మరో పదిహేనో ఇరవయ్యో తగ్గితే ఏమి జరిగేది అన్న చర్చ ఎపుడూ లేదు. కానీ రాహుల్ గాంధీ తాజా వ్యాఖ్యలను చూస్తే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు అంతా. ఏ 200 దాకానో మరి కొద్ది ఎంపీలతోనో బీజేపీకి నంబర్ వచ్చి ఉంటే కచ్చితంగా మోడీని ప్రధాని రేసులో ఉంచరని ఆనాడే విశ్లేషణలు ఉన్నాయి. కానీ జరిగింది వేరు కాబట్టి మోడీ మూడోసారి ముచ్చటగా ప్రధాని అయ్యారు. లేకపోతే బీజేపీ నుంచే కొత్త వారు వచ్చే వారు. లేదా బీజేపీకి 200 నంబర్ కంటే తక్కువ వస్తే ఇండియా కూటమే పవర్ చాన్స్ తీసుకునేది.
అందుకే రాహుల్ ఆగ్రహం :
కేంద్ర ఎన్నికల సఘం చాలా ఓట్ల విషయంలో చోరీ చేసింది అని రాహుల్ పదే పదే ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికలు కూడా సజావుగా జరగలేదు అని ఆయన అంటున్నారు. మోడీ ప్రధానిగా కచితంగా అయ్యేవారు కాదు అని ఆ విధంగా ఆయన మళ్ళీ పీఠం ఎక్కడానికి ఈసీ చేసిన సాయమే ఎక్కువగా ఉందని రాహుల్ ఆరోపణగా ఉంది. ఒక వైపు ఈసీ రాహుల్ ఆరోపణలు ఖండిస్తున్నా ఆయన మాత్రం ఇదే నిజం అంటున్నారు. తన వద్ద ఆధారాలు కూడా చాలా ఉన్నాయని చెబుతున్నారు ఏది ఏమైనా మోడీ ప్రధానిగా మూడవసారి అవడం మాత్రం రాహుల్ గాంధీ తప్పు అనే అంటున్నారు. చూడాలి మరి రాహుల్ గాంధీ ఆగ్రహం ఇంకా ఏ లెవెల్ కి చేరుకుంటుందో. మరెన్ని సంచలన వ్యాఖ్యలు చేయిస్తుందో.