మోడీ కంటే ముందే రాహుల్...రిజల్ట్ మారుతుందా ?
ఇక దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఎన్నికల కంటే ముందు ప్రధాని మోడీ ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతూ వస్తోంది.;
గత పదకొండేళ్ళుగా దేశంలో రాజకీయం మారింది. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత బలమైన ప్రధానిగా నరేంద్ర మోడీ ఎమెర్జ్ అయ్యాక దేశంలోని రాజకీయంలోనే టోటల్ గా మార్పు వచ్చేసింది. వివిధ అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో ప్రధాని కాలికి బలపం కట్టుకుని తిరగడం తమ పార్టీని గెలిపించడం ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం బీజేపీలో పరిపాటిగా మారింది. మరో వైపు చూస్తే బీజేపీలో రాష్ట్ర నేతల ప్రాముఖ్యత తగ్గి మోడీ ఇమేజ్ తో గెలవడం అన్నది ఒక అలవాటుగా కూదా మారింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు :
ఇక దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఎన్నికల కంటే ముందు ప్రధాని మోడీ ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతూ వస్తోంది. ఇక విపక్షాలు అయితే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక మెల్లగా ప్రచార పర్వంలోకి దిగేవారు. అప్పటికే మోడీ తొంబై శాతం ప్రచారం పూర్తి చేసేసి సర్వం సిద్ధం చేసుకుని గెలుపు ఆశలను పార్టీకి కలిగించేవారు. ఇదంతా గడచిన కాలంలో జరుగుతున్న తంతు. అందరికీ అర్ధమవుతున్న విషయమైనా విపక్షం మాత్రం ఎందుకో ఆ అడ్వాన్స్ చాన్స్ తీసుకోలేకపోయేది.
ఫస్ట్ టైం రాహుల్ ఫీల్డ్ లోకి :
అయితే తొలిసారిగా మోడీ ఎన్నికల వ్యూహానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అడ్డు పడ్డారు. ఆయన బీహార్ ఎన్నికలు కొద్ది నెలలలో జరగబోతాయి అన్న నేపధ్యంలో ఫీల్డ్ లోకి ముందుగానే దిగిపోయారు. ఆయనకు ఇపుడు ఓటు చోరీ అన్న బలమైన నినాదం ఆయుధంగా మారింది. దాంతో ఆయన జనంలోకి దూసుకుని పోతున్నారు. ఓటు ప్రతీ వారికి ఉండాలి, ప్రతీ వ్యక్తికి ఒకటే ఓటు అన్న నినాదంతో ఆయన ప్రజల వద్దకు వస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన రాష్ట్రంలోని సమస్యలను కూడా ఏకరువు పెడుతున్నారు. దాంతో బీహార్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ మొదలెట్టేసారు అని అంటున్నారు.
ఆయన సీఎం గా:
బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ బలమైన విపక్షంగా ఉంది. దాని నాయకుడు గా లాలూ ప్రసాద్ ఉన్నారు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనే కాబోయే సీఎం గా ఇండియా కూటమి తరుఫున హైలెట్ అవుతున్నారు 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీకి 78 సాకా అసెంబ్లీ సీట్లు వచ్చాయి. గెలుపునకు దగ్గరలోకి ఆయన వచ్చారు. ఈసారి ఆయన సీఎం కావడం తధ్యమని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో అనుకోని విధంగా ముందుగానే రాహుల్ ఫీల్డ్ లోకి వచ్చారు. ఆయన చేస్తున్న అధికార్ ఓటు యాత్ర ద్వారా మరింతగా ఇండియా కూటమి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
రాహుల్ గాంధీని పీఎం చేస్తా :
ఇక లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ అయితే మంచి ధీమాగా ఉన్నారు. కొద్ది నెలలలో తానే బీహార్ అధికార పగ్గాలు అందుకుంటాను అని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆనందంతో ఆయన మరో మాట అంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు ఖాయమని చెబుతున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేంతవరకు తాను విశ్రమించబోమని చెబుతున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ముందు ఇండియా కూటమికి తెచ్చిన ఊపుగా దీనిని అంతా చూస్తున్నారు.
మోడీ వెనకబడతారా :
ప్రచార పర్వంలో ఎప్పటికపుడు కొత్త పుంతలు తొక్కించే సత్తా నైపుణ్యం నరేంద్ర మోడీకి ఉన్నాయి. దాంతో ఎన్డీయే కూటమి ఆయన మీదనే పెద్ద ఆశలు పెట్టుకుంది. అయితే ఒక వైపు సుదీర్ఘ కాలం నితీష్ కుమార్ బీహార్ సీఎం గా ఉండడం ఎన్డీయే ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ పైగా రాహుల్ గాంధీ ఈస్ మీద బీజేపీ మీద చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ కలసి బీహార్ లో ఎన్డీయే ఆశలను ఏ మేరకు దెబ్బ తీస్తాయన్న చర్చ సాగుతోంది మోడీ ప్రచారంలో వెనకబడితే మరింత ఇబ్బంది అని అంటున్నారు. చూడాలి మరి లేటుగా వచ్చినా లేటెస్ట్ గా తానే ఉంటాను అని మోడీ ఈ ఎన్నికల్లో నిరూపించబఒతున్నారా అన్నది.