• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆర్ బీఐ గవర్నర్ గా పని...

ఆర్ బీఐ గవర్నర్ గా పని చేసే వేళలో రఘరామ్ రాజన్ జీతం అంతా?

| తాజాగా రాజ్ షమానీ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రఘురామ రాజన్.. ప్రస్తుత ఆర్ బీఐ గవర్నర్ జీతాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేకపోయారు.

By - Tupaki Desk
Update: 2023-12-27 04:47 GMT

అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పుడు జీతాల గురించి ఆలోచించకుండా.. తనకు తగ్గ గౌరవం దక్కిందని భావిస్తూ.. పనిలో పూర్తిగా నిమగ్నమయ్యే ప్రముఖులు కొందరు ఉంటారు. అలాంటివారు ఆ తర్వాతి రోజుల్లో తాము చేసిన పనిని.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని చెప్పనప్పుడు.. ఇలా కూడా ఉంటుందా? అన్న భావన కలుగుక మానదు. భారత్ రిజర్వు బ్యాంక్ కు గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్ తన వార్షిక జీతాన్ని వెల్లడించి.. అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. అందుకు కారణం.. ఆయన చేతికి వచ్చిన మొత్తమే.

తాజాగా రాజ్ షమానీ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రఘురామ రాజన్.. ప్రస్తుత ఆర్ బీఐ గవర్నర్ జీతాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేకపోయారు. తాను మాత్రం ఏడాదికి రూ.4లక్షల మొత్తాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత జీతం వస్తుందన్నది తెలీదన్నారు.

ఆర్ బీఐ గవర్నర్ గా తాను పొందిన అతి పెద్ద ప్రయోజనం గురించి చెప్పిన రఘురామ్ రాజన్.. "దీరూభాయి అంబానీ ఇంటికి దగ్గర్లో ఉన్న మలబార్ హిల్స్ అనే పెద్ద ఇంట్లో నివాసాన్ని కల్పించటం అతి పెద్ద ప్రయోజనం" అని పేర్కొన్నారు. 2013 నుంచి 2016 మధ్యన ఆర్ బీఐ గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్.. క్యాబినెట్ సెక్రటరీగా సమానమైన జీతాన్ని పొందినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయనకు పెన్షన్ వంటివి రాలేదని పేర్కొన్నారు. దీనికి తోడు సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ వస్తున్న నేపథ్యంలో తనకు రాలేదేమోనని పేర్కొన్నారు. మోడీ సర్కారు కొలువు తీరిన కొంతకాలం వరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ గా వ్యవహరించిన ఆయన.. తన పదవీ కాలం పూర్తి అయిన వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. షికాగో వర్సిటీలో ప్రొఫెసర్ గా ఫుల్ టైం జాబ్ చేస్తున్నట్లుగా చెబుతారు. ఇటీవల ఆయన రాసిన పుస్తకం విడుదలైంది. మొత్తంగా చూస్తే.. భారత దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా వ్యవమరిస్తూ.. దేశ ప్రజలు వాడే కరెన్సీ మీద సంతకం ఉండే వ్యక్తికి వచ్చే నెలసరి జీతం రూ.35వేల కంటే తక్కువగా ఉండటం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.

Tags:    
  • Raghuramrajan 
  • Salary 
  • Rbigovernor 
  • Formergovernor 
  • Working 
  • Raguram 
  • Podcast 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS