• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సహనం నశిస్తోంది.....

సహనం నశిస్తోంది.. అణుబాంబు దాడికీ వెనుకాడను.. పుతిన్

| తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న దేశానికి అణు శక్తి కలిగిన మరో దేశం సహకరిస్తే దానిని తీవ్రంగా పరిగణిస్తామని పుతిన్ తేల్చిచెప్పారు.

By - Tupaki Desk
Update: 2024-09-26 11:28 GMT

రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఆయుధాలు అయిపోతున్నాయ్.. చిట్టెలుకలా భావించిన ప్రత్యర్థి ఎంతకూ లొంగడం లేదు.. దానికి నుంచి పాశ్చాత్య దేశాలు మద్దతు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహనం కోల్పోయినట్లుగా తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సాగిస్తున్న శాంతి ప్రయత్నాలు ఓ కొలిక్కిరావడం లేదు. మోదీని మించి మరే నాయకుడికీ పుతిన్ ను ఆపే శక్తి లేదు. తాజాగా ఆయన ఓ తీవ్ర హెచ్చరిక చేశారు.

అణు దేశం మద్దతిస్తే సహించం..

తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న దేశానికి అణు శక్తి కలిగిన మరో దేశం సహకరిస్తే దానిని తీవ్రంగా పరిగణిస్తామని పుతిన్ తేల్చిచెప్పారు. దీనివెనుక ఆయన ఉద్దేశం ఏమిటో తెలుస్తోంది. ఈ హెచ్చరిక అమెరికాను ఉద్దేశించినదే. లేదా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలకు సంబంధించినది. కాగా, అణ్వస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతు పలికితే.. అది రెండు దేశాలు కలిపి చేస్తున్నట్లుగా భావిస్తామని కూడా పుతిన్ పేర్కొన్నారు. అంటే.. ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్న దేశాలను ఉద్దేశించి మాట్లాడారు.

అణ్వాయుధాలతోనే సమాధానం..?

పుతిన్ ఇప్పుడే కాదు.. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన 2022 ఫిబ్రవరి 24 తర్వాత కొద్ది రోజులకే అణ్వాయుధాన్ని వాడతామని హెచ్చరించారు. అయితే, ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు చేసిన హెచ్చరికలో.. తామిచ్చే జవాబు అణ్వాయుధాలతోనా? అనేది చెప్పలేదు. కాగా, ఉక్రెయిన్ కు నాటో దేశాలు పెద్దఎత్తున ఆయుధాలు అందిస్తున్నాయి. వాటితోనే ఇప్పటివరకు పోరాడుతూ వస్తోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా మరిన్ని ఆయుధాలు ఇస్తే రష్యాను ఓడిస్తామని చెప్పారు.

అవి వాడితే..

నాటో ఉక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి ఆయుధాలు అందించింది. వాటిని ప్రయోగిస్తే అది రష్యా-నాటో యుద్ధంగానే చూస్తామని పుతిన్‌ అంటున్నారు. తాము ఇచ్చే ఆయుధాలపై అమెరికా సహా నాటో దేశాలు ఉక్రెయిన్ కు కొన్ని పరిమితులు విధించాయి. వాటిలో దీర్ఘశ్రేణి ఆయుధాలు కూడా ఉన్నాయి. అయితే, రష్యా అణు ముసాయిదాలో ఇటీవల మార్పులు చేశారు. దాని ప్రకారం శత్రవులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్‌ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తే అణ్వస్త్రాలను వాడేందుకు రష్యా నిర్ణయం తీసుకోవచ్చు.

Tags:    
  • Russia 
  • RussianPresident 
  • VladimirPutinPressmeet 
  • UnitedStates 
  • Britain 
  • Germany 
  • France 
  • Nuclearweapons 

Similar News

'అప్పిరెడ్డి'పై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?

2026-11-08 16:30 GMT

''జ‌గ‌న్ ఊరుకోరు: ఇంచార్జ్‌ల‌ను మార్చేస్తారు.. ! ''

2026-11-08 15:30 GMT

కూట‌మి గెలుపు బాగుంది.. అస‌లు స్టోరీ ఏంటంటే.. !

2026-11-08 14:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..

2026-11-08 13:34 GMT

నాడు సస్పెండ్ చేశారు.. నేడు దండలేసి ఆహ్వానిస్తున్నారు! స్థానిక రాజకీయంలో తిరగబడ్డ సీన్

2026-11-08 13:30 GMT

ఈ-20 వ‌ర్సెస్ 420 : రాహుల్ కొత్త వివాదం!

2026-11-08 12:30 GMT

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

2026-11-08 11:15 GMT

జ‌గ‌న్ - అదానీ భేటీ.. పొలిటిక‌ల్ చ‌ర్చ నిజ‌మేనా ..?

2026-11-08 11:14 GMT

దుర్మార్గుడు... కేటీఆర్‌: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

2026-11-08 11:14 GMT

రిమాండ్ ఖైదీ సంచలన విజయం.. జడ్పీటీసీగా వైసీపీ నేతకు పట్టం కట్టిన ఓటర్లు

2026-11-08 11:14 GMT

స్థానికం అంటే ఇంతేమరి.. ఓటర్ల లెక్క వేరే, ఈ ఫలితాలే నిదర్శనం

2026-11-08 11:12 GMT

Copyright @2026

Powered by Blink CMS