పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి...అదొక్కటే రీజన్ ?
ఇక గోదావరి జిల్లాలలో తీసుకుంటే నరసాపురం ఎంపీ అయిన శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రిగా చాన్స్ దక్కింది. ఆయన కాకపొతే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి ఇవ్వాలి.
కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు ఏపీ నుంచి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. 21 మంది లోక్ సభ సభ్యులు కూటమికి ఉన్నారు. అలాగే రాజ్యసభ సభ్యులు అయితే ఎనిమిది మంది ఉన్నారు. అంటే 29 మంది ఎంపీలు అన్న మాట. వీరిలో లోక్ సభ నుంచి ముగ్గురుకి చాన్స్ 2024 ఎన్నికల తరువాత ఏర్పడిన మోడీ మంత్రి వర్గంలో దక్కింది. ఇపుడు ఆ ముగ్గురికీ కంటిన్యూ చేస్తూనే మరో ఇద్దరికి చోటు కల్పిస్తారు అని అంటున్నారు. లేదా ఉన్న వారిలో ఒకరిని తగ్గించి మరో ఇద్దరిని తీసుకుంటారు అని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సామాజిక పార్టీల సమీకరణలు చూస్తే ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రులూ కొనసాగుతారని కచ్చితంగా చెప్పవచ్చు. వీరు కాకుండా మరో ఇద్దరికి చోటు కల్పిస్తే మోడీ ప్రభుత్వం ఏపీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా లెక్క అని అంటున్నారు.
గోదావరి జిల్లాల్లో :
ఇక గోదావరి జిల్లాలలో తీసుకుంటే నరసాపురం ఎంపీ అయిన శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రిగా చాన్స్ దక్కింది. ఆయన కాకపొతే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి ఇవ్వాలి. నిజానికి 2024లోనే పురంధేశ్వరికి చాన్స్ కల్పించాల్సి ఉంది. ఆమె తనకు పార్టీ అప్పగించిన అన్ని బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చారు. ఆమె ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడే ఏపీలో కూటమి ఏర్పాటు అయింది. బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు దక్కారు. ఆమె చేసిన సేవలు అలాగే ఆమె సీనియారిటీ గతంలో యూపీయే ప్రభుత్వంలో ఇండిపెండెంట్ చార్జీతో ఆమె చేపట్టిన మంత్రిత్వ శాఖలలో ఆమె చూపించిన చొరవకు కచ్చితంగా మంత్రి పదవి దక్కాలి. కానీ ఆమెకు సామాజిక సమీకరణల వల్లనే మంత్రి పదవి దక్కడం లేదని అంటున్నారు.
ఆయనకు ప్రమోషన్ :
అనూహ్యంగా గుంటూరు నుంచి ఎంపీ అయిన వారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన గెలిచిన తరువాత చంద్రబాబు కేంద్ర మంత్రి పదవికి ఆయన పేరు సిఫార్సు చేశారు. పెమ్మసానికి కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. ఆయన ఆ శాఖలలో మంచి ప్రావీణ్యం కనబరచారు. కేంద్ర పెద్దల వద్ద తన పనితీరుతో మెప్పు పొందారని అంటున్నారు. ఇటు పార్టీపరంగా టీడీపీకి ఆయన ఎంతో అండగా ఉంటున్నారు. దాంతో ఆయనకు ఈసారి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ప్రమోషన్ దక్కుతుందని అంటున్నారు. అంటే ఇండిపెండెంట్ మంత్రిగా ఆయనకు కీలక శాఖలు అప్పగిస్తారు అని అంటున్నారు. దాంతో ఆయనకు చోటు దక్కితే పురంధేశ్వరికి ఆ మేరకు ఆశలు సన్నగిల్లుతాయని అంటున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే విశేషం.
వచ్చే ఎన్నికల కోసం :
ఈ సామాజిక సమీకరణల కారణంగానే పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కడం కష్టం అని అంటున్నారు. అయితే కేంద్ర పెద్దలు కనుక ఒక క్లియర్ కట్ డెసిషన్ తీసుకుంటే మాత్రం ఆమె కేంద్ర మంత్రి కావడం అనూహ్యం ఏమీ కాదని అంటున్నారు. బీజేపీ ఒక పార్టీగా ఆమెకు చోటు కల్పించవచ్చు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో మంత్రి పదవి కాబట్టి ఈ లెక్కలు చూసుకోకుండా ప్రతిభకు చాన్స్ అంటే కనుక పురంధేశ్వరి కచ్చితంగా కేబినెట్ లో ఉంటారని అంటున్నారు. అపుడు గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాసవర్మకు చాన్స్ ఉండదని అంటున్నారు. మరి బీజేపీ పెద్దలు ఏ విధంగా ఆలోచన చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఇక పురంధేశ్వరి మాత్రం 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అది కూడా రాజమండ్రి ఎంపీ సీటు నుంచే అని ప్రచారం సాగుతోంది. దాంతో ఆమె మరింత కాలం రాజకీయాల్లో ఉంటూ కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేయడం ఖాయమని అంటున్నారు.