బిజినెస్ ఎలా చేయాలో ఈయన్ను చూసి నేర్చుకోండబ్బా..?

అది ఢిల్లీలోని ఒక మెట్రో స్టేషన్. బయట చూస్తే కుంభవృష్టి.. లోపల చూస్తే ఆఫీసులకి, ఇళ్లకు వెళ్లలేక బిక్కమొహాలు వేసుకుని నిల్చున్న వందలాది మంది ప్రయాణికులు.

Update: 2026-07-11 04:13 GMT

ఢిల్లీలో క్లైమేట్ మారితే చాలు.. కొందరికి ముక్కు కారుతుంది.. ఇంకొందరికి కన్నీళ్లు కారుతాయి. కానీ మన ‘స్టార్టప్’ సుల్తాన్‌కు మాత్రం ఐడియాలు కారాయి.. మొన్నటికి మొన్న ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షానికి సామాన్య జనం "అయ్యో.. దేవుడా!" అంటూ మెట్రో స్టేషన్ల లోపల దాక్కుంటే.. ఓ కిలాడీ వ్యాపారి మాత్రం "ఇదే కదా నా అదృష్ట రేఖ" అనుకున్నాడు. ఇంకేముంది.. జనం వర్షానికి తడుస్తుంటే ఈయన గొడుగుల బిజినెస్‌తో నోట్ల వర్షంలో తడిసి ముద్దయ్యాడు. ప్రస్తుతం ఈ ‘బిజినెస్ బ్లాక్‌బస్టర్’ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సీన్ కట్ చేస్తే.. మెట్రో స్టేషన్ వద్ద ‘గొడుగుల హంగామా’

అది ఢిల్లీలోని ఒక మెట్రో స్టేషన్. బయట చూస్తే కుంభవృష్టి.. లోపల చూస్తే ఆఫీసులకి, ఇళ్లకు వెళ్లలేక బిక్కమొహాలు వేసుకుని నిల్చున్న వందలాది మంది ప్రయాణికులు. సరిగ్గా అదే టైంలో.. బ్యాక్‌గ్రౌండ్‌లో మాస్ ఎలివేషన్ మ్యూజిక్ లేకపోయినా చేతిలో ఒక యాభై గొడుగుల స్టాక్‌తో ఎంట్రీ ఇచ్చాడు మన బిజినెస్ బ్రెయిన్. "రైట్ ప్రొడక్ట్.. రైట్ ప్లేస్.. రైట్ టైమ్!" నెటిజన్లు పెడుతున్న కామెంట్లు చూస్తుంటే ఎంబీఏ చదువుకున్నోళ్లు కూడా తలపట్టుకోవాల్సిందే.

సాధారణంగా ఎండ తగిలితేనో వాన పడితేనో బేరాలు ఆడే జనం.. అక్కడ పరిస్థితి చూసి రూపాయి తగ్గించకుండా కొనేశారు. ఒక్కో గొడుగు ధర అక్షరాలా రూ. 200. డిమాండ్ అలా ఉంది మరి. గంట తిరిగేసరికి 50 గొడుగులు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. జేబులోకి రూ. 10,000 వచ్చి చేరాయి. ఐఐటీ, ఐఐఎం కుర్రాళ్లు పీపీటీలు ప్రజెంట్ చేసి ఫండింగ్ తెచ్చుకునే లోపు.. ఈయన కేవలం వాన చినుకులను నమ్ముకుని గంటలో ‘ప్రాఫిట్’ బుక్ చేసుకున్నాడు.

నెటిజన్ల ‘దిస్ ఈజ్ బిజినెస్’ కామెంట్లు.. కొందరి కడుపు మంట!

ఈ తతంగాన్ని ఎవరో మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదలడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది. వీడియో చూసిన నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి పంచాయితీలు మొదలుపెట్టారు. పాజిటివ్ గ్యాంగ్ ఏమో "ఇది సార్ బిజినెస్ అంటే! సమస్య ఎక్కడ ఉందో చూసి, అక్కడ పరిష్కారాన్ని అమ్మేశాడు. ఈయనే మాకు ఇన్స్పిరేషన్. డిమాండ్ అండ్ సప్లై థియరీని ప్రాక్టికల్‌గా నిరూపించాడు." అంటూ హారతులు పడుతున్నారు. నెగెటివ్ గ్యాంగ్ మాత్రం "ఇదేం న్యాయం బాస్? జనం కష్టాల్లో ఉంటే బ్లాక్ మార్కెట్ చేస్తాడా? ₹80 గొడుగును ₹200 కి అమ్ముతాడా?" అంటూ నీతి సూత్రాలు వల్లిస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆ వానలో తడవకుండా ఇంటికి వెళ్లడానికి ఆ ₹200 పెద్ద భారమేమీ కాదని ప్రయాణికులకు కూడా తెలుసు. అందుకే బేరాల్లేకుండా బిజినెస్ సాగిపోయింది.

ఎంబీఏలు వేస్ట్.. సమయస్ఫూర్తే ఫస్ట్

ఈ ఘటనే గనుక అమెరికాలో జరిగి ఉంటే.. "రియల్ టైమ్ క్లైమేట్ బేస్డ్ క్విక్ కామర్స్" అని పెద్ద పేరు పెట్టి ప్రశంసించేవారేమో. ఏదేమైనా ఈ గొడుగుల వీరుడు నిరూపించింది ఒక్కటే.. వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి కోట్ల పెట్టుబడులు, పెద్ద పెద్ద ఆఫీసులు అక్కర్లేదు. పరిస్థితులను క్యాష్ చేసుకునే ‘సమయస్ఫూర్తి’, కస్టమర్ అవసరాన్ని క్యాష్ చేసుకునే ‘తెలివితేటలు’ ఉంటే చాలు.

అయినా.. ఢిల్లీ వానలో తడిసి జలుబు తెచ్చుకుని హాస్పిటల్ పాలై ₹2000 డాక్టర్‌కి ఇచ్చుకోవడం కంటే.. మన ‘గొడుగుల అన్న’కు ₹200 ఇచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్లడం బెటర్ కదా.. సో.. "దిస్ ఈజ్ బిజినెస్ బాస్!"

Tags:    

Similar News