జనంలోకి టీడీపీ.. రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ ఊపు!
ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ము ఖ్య నాయకులకు కూడా ఇప్పటికే దీనిపై దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది.
రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్- ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. దీంతో ఆ మరుసటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని జోరుగా ప్రారంభించేందుకు రెడీ అయింది. దీనిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాలని తలపోస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ము ఖ్య నాయకులకు కూడా ఇప్పటికే దీనిపై దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది.
కానీ, సర్ ప్రక్రియ కారణంగా టీడీపీ అధినేత ఇంటింటికీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక, ఇప్పుడు ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ప్రతి ఇంటినీ కలవాలని.. ప్రతి ఒక్కరినీ కలుసుకుని ప్రభుత్వం సహా.. పార్టీకి సానుకూలంగా ఓటు బ్యాంకును రాబట్టా లని టీడీపీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఈ రెండు సంవత్సరాల కాలంలో చేపట్టిన పనులపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
అదేసమయంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు చేపట్టిన అభివృద్ధికార్యక్రమాలపైనా కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై మరింత సానుకూలతను పెం చాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం ఏం చేశారో చెప్పడానికి మాత్రమే పరిమితం కాకుండా.. చేయాల్సిన పనులపైనా ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. తద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేలా ఎమ్మెల్యేలు కీలక బాధ్యతలు తీసుకోవాలి.
ఏం చేస్తారు..?
దాదాపు నెల రోజుల పాటు నిర్వహించే ఇంటింటికీ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసు కుంటారు. ప్రజల ఆలోచనలు తెలుసుకుంటారు. ఎమ్మెల్యేలపై ఉన్న గ్రాఫ్‌ను కూడా పార్టీ అంచనా వే స్తుంది. తద్వారా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలానే, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయంతోపాటు.. పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉ పాధి అవకాశాలు, సంక్షేమ పథకాలపైనా అభిప్రాయాలు తెలుసుకుంటారు. అనంతరం.. వాటి ఆధారంగా మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది.ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా పరిగణిస్తోంది.