రేవంత్ ఫ్లెక్సీలు...అటు ఎన్టీఆర్...ఇటు జగన్ !

అయితే ముఖ్యమంత్రి రేవంత్ సభకు వస్తున్నారు అని ఆయనకు ఘన స్వాగతం స్థానిక నేతలు పలికారు. ఇక్కడే ఫ్లెక్సీలతో రాజకీయ కాక పుట్టించారు.

Update: 2026-07-10 17:24 GMT

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సభ అది. ప్రభుత్వం వారిదే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ అలాగే జగన్ ఫోటోలు కూడా ఉండడమే రాజకీయంగా అతి పెద్ద చర్చకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో కాంగ్రెస్ పార్టీ రైతు ఆశీర్వాద సభను శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హాజరై రైతు భరోసా కింద ఆఖరి విడత నిధులను విడుదల చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ సభకు వస్తున్నారు అని ఆయనకు ఘన స్వాగతం స్థానిక నేతలు పలికారు. ఇక్కడే ఫ్లెక్సీలతో రాజకీయ కాక పుట్టించారు.

జగన్ ఫోటోలతో అలా :

స్థానిక కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోలను ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసారు. ఆ పక్కనే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఫోటో కూడా పెద్దగానే ఫ్లెక్సీలలో ఏర్పాటు చేయడం అతి పెద్ద విశేషంగా ఉంది. ఇది రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే దీంతో పాటుగా మరో విధంగా చర్చకు తావిస్తూ ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్ టీఆర్ ఫోటో కూడా ఫ్లెక్సీల మీద ఏర్పాటు చేశారు. దాంతో కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలలో టీడీపీ వ్యవస్థాపకుడు, అలాగే వైసీపీ అధినేత ఫోటోలు ఉండడం మీద హాట్ హాట్ గానే పొలిటికల్ డిబేట్ సాగుతోంది.

ఈ ఇద్దరు నేతల ఫోటోలు :

కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ నేతల ఫోటోల మధ్యన ఇతర పార్టీ నేతల ఫోటోలు ఎందుకు ఎలా వచ్చాయి అన్నదే చర్చ. అయితే అదంతా అభిమానంతో స్థానిక నేతలు ఏర్పాటు చేసుకున్నది అని అంటున్నారు. జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలను మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేశారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే దీనికి పోటా పోటీగా ఎన్టీఆర్ ఫోటోను ఫ్లెక్సీ మీద ప్[ఎట్టి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోలు ఏర్పాటు చేశారు. ఇలా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలలో ఇతర పార్టీల నేతల ఫోటోలు సైతం కనిపించి అందరినీ ఆకట్టుకున్నాయి.

వారి అనుచరుల అభిమానం :

ఈ ఫోటోలు ఫ్లెక్సీల మీద ఎందుకు పెట్టారు అంటే దాని మీద రకరకాలైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైసీపీ నుంచి ఎంపీగా ఇక్కడ నుంచి గెలిచారు. ఆయన వైసీపీలో గతంలో పనిచేశారు. దాంతో ఆయన అనుచరులు జగన్ ని కూడా అభిమానిస్తారు. అందుకే ఆయన ఫోటో పెట్టారు అని అంటున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఇదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి. ఆయన టీడీపీలో చాలా ఏళ్ళ పాటు పనిచేశారు. ఆయన అనుచరులు ప్రేమతో ఎన్టీఆర్ ఫోటో ఫ్లెక్సీకి ఎక్కించారు అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ కి ఇవాన్నీ అదనపు బలాలు అని అంటున్నారు. అందుకే దీని మీద చర్చ సాగినా కాంగ్రెస్ కి వచ్చిన ఇబ్బంది లేకపోగా అనుకూలమే అని అంటున్నారు.

Tags:    

Similar News