మాజీ డీజీపీ కుమారుడి మరణ రహస్యం.. హాట్ టాపిక్ గా ఫోటోలు!
పంజాబ్ లో మాజీ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;
పంజాబ్ లో మాజీ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముస్తఫా.. ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో మాజీ డీజీపీ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా అతని కుమారుడి ఫోటోలు, వీడియోలు ఉన్నాయనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
అవును... తన కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో... దీనిపై ఇటీవల ముస్తాఫా స్పందిస్తూ... తన కుమారుడికి డ్రగ్స్ అలవాటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తన కుమారుడు గత 18 ఏళ్లుగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని, అది ఓవర్ డోస్ కావడంతోనే మృతి చెందాడని తెలిపారు. అయితే తాజాగా ఆయన వాదనకు పూర్తి విరుద్ధమైన విషయం వెలుగులోకి వచ్చిందనే చర్చ మొదలైంది.
వివరాళ్లోకి వెళ్తే... పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా కుమారుడు అఖీల్ అక్తర్ అనుమానాస్పద మరణం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. అఖీల్ ఆరోగ్యంగా, సాధారణంగా కనిపిస్తున్నట్లు.. తన తల్లి రజియా సుల్తానాతో కలిసి ప్రచారం చేస్తున్నట్లు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయని చెబుతున్నారు. ఒక వీడియోలో.. అతడు ఒక చిన్న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది!
అయితే.. అకీల్ గత 18 సంవత్సరాలుగా మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని, తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తరచుగా డీ-అడిక్షన్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందని పదే పదే చెబుతున్నప్పటికీ.. ఈ ఫోటోలు ఆ వాదనతో ఏకీభవించడం లేదని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో... మలేర్ కోట్లాకు చెందిన రాజకీయ కార్యకర్త షంషుద్దీన్ చౌదరి ఓ కీలక ప్రశ్నను లేవనెత్తారు.
ఇందులో భాగంగా... తన కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు అకీల్ నిజంగా డ్రగ్స్ కు అంత వ్యసనపరుడైపోయి ఉంటే.. మానసికంగానూ అనారోగ్యంతో ఉంటే.. ఆ ఫోటోల వెనుక ఉన్న నిజం ఏమిటి? అని షమ్షుద్దీన్ ప్రశ్నించారు. ఇదే సమయంలో... ప్రస్తుతం బయటకు వచ్చిన అకీల్ ఫోటోలు, వీడియోలలో ఎక్కువ భాగం మలేర్ కోట్లా కాంగ్రెస్ తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసినవే కదా అని అంటున్నారు!
ఇదే సమయంలో... కొడుకుగా అతను రజియా సుల్తానా ర్యాలీలలో ఒక్కసారి మాత్రమే కాదు, చాలాసార్లు కనిపించాడని.. పార్టీ సోషల్ మీడియా పేజీలలో జాబితా చేయబడిన తేదీలను పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా.. అకీల్ ఫోటోలు 2017, 2019 మధ్య నాటివని.. 2022 పంజాబ్ ఎన్నికల్లోనూ అకీల్, రజియా సుల్తానా తరపున ప్రచారం చేశాడని.. ఆ సమయంలో అతను పూర్తిగా సాధారణంగా ఉన్నాడని కూడా చెబుతున్నారు!
స్పందించిన సిట్ చీఫ్!:
ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పాల్గొనమని మహమ్మద్ ముస్తఫాతో పాటు అకీల్ కుటుంబ సభ్యులకు నోటీసులు పంపినట్లు సిట్ చీఫ్ విక్రమ్ నెహ్రా స్పష్టం చేశారు. ఈ కేసును ప్రాధాన్యతా క్రమంలో దర్యాప్తు చేస్తున్నామని, అన్ని అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. మరోవైపు... ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని హర్యానా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలుస్తోంది.