తెలుగు తమ్ముళ్లకు నేనున్నానంటున్న కాంగ్రెస్ మంత్రి

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మితృలు ఉండరు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం.

Update: 2024-05-10 14:30 GMT

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మితృలు ఉండరు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2009 ఎన్నికల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో జతకట్టింది. 2018 ఎన్నికల్లో అదే పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది. ఫలితాలు ఎలా ఉన్నా ప్రయోగాలు మాత్రం ఫలించలేదు.

2014లో బీజేపీతో పొత్తుతో ఏపీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, 2019లో ఒంటరిగా పోటీ చేసి అధికారం కోల్పోయింది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో తిరిగి బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుంది. అయితే 2023 తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ నుండి తప్పుకున్న టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ గెలుపుకు దోహదపడింది. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో బీజేపీతో పొత్తు నేపథ్యంలో టీడీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నది.

తెలంగాణ మొత్తం ప్రాభవం కోల్పోయినా ఖమ్మం జిల్లాలో టీడీపీ ప్రభావం ఉంది. అక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ టీడీపీ గట్టిగా ఉంది. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తోడ్పాటుతో కాంగ్రెస్ అభ్యర్థులు, ప్రస్తుత తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు విజయం సాధించారు. ఖమ్మంలో 10 స్థానాలకు భద్రాచలం మినహా 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ నుండి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరిపోయాడు.

Read more!

ఈ నేపథ్యంలో ఖమ్మ లోక్ సభ స్థానం నుండి మంత్రి పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలుగు తమ్ముళ్లకు ధన్యవాదాలు తెలిపిన పొంగులేటి ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల సాయం కోరుతున్నాడు. అన్ని వేళలా తెలుగు తమ్ముళ్లకు అండగా ఉంటానని, ఈ ఎన్నికల్లో నాకు సహకరించినట్లే తన వియ్యంకుడికి సహకరించి ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వర్ రావు పోటీలో ఉన్న నేపథ్యంలో పొంగులేటి ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News