అసెంబ్లీ ఎలక్షన్స్: లెటర్‌తో మొదలు పెట్టిన మోడీ
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రం, పెద్ద సంఖ్యలో శాసన సభ స్థానాలు(294) ఉన్న పశ్చి మ బెంగాల్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.;
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రం, పెద్ద సంఖ్యలో శాసన సభ స్థానాలు(294) ఉన్న పశ్చి మ బెంగాల్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ పాగా వేయాలన్న సంకల్పంతో బీజేపీ నాయకులు గత రెండేళ్లుగా కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బెంగాల్ ప్రజలకు ప్రధాన మంత్రి తాజాగా సుదీర్ఘ లేఖను సంధించారు.
`జై మహాకాళీ` అని ప్రారంభించిన ప్రధాని.. బెంగాల్ ప్రజల ఆరాధ్యదైవం కాళీమాత సెంటిమెంటుతో తన లేఖను మొదలు పెట్టడం గమనార్హం. దీనిలో ప్రధానంగా తాము రాష్ట్రానికి సాయం చేసేందుకు ముందు కు వస్తుంటే.. దీదీ(సీఎం మమతా బెనర్జీ) ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల్లోనే ఇక్కడి ప్రజల జీవితాలను మార్చే కీలక ఎన్నిక లు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. బీజేపీ చేపడుతున్న అభివృద్ధికి అందరూ కలిసి రావాలని సూచించారు.
భావితరాల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రజలు వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలని ప్రధా ని మోడీ అభ్యర్థించారు. `బంగారు బంగ్లా` కలల సాకారానికి తాను భరోసా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఇక్క డి ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపిస్తుందని తెలిపారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రం లో ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను అన్ని విధాలా అభివృధ్ధి చేసేందుకు తాను సంకల్పించుకున్నానని.. చెప్పారు.
వికసిత్ బంగ్లా..
``వికసిత్ బంగ్లా సాధించేందుకు.. నేను నిర్ణయించాను.దీనికి మీ సహకారం ఎంతో అవసరం`` అంటూ.. బంగ్లాదేశ్ ప్రజలను ఆయన అభ్యర్థించారు. బెంగాల్ అభివృద్ధి విషయంలో మమతాబెనర్జీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని ఆరోపించిన ప్రధాని.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. తాము బెంగాల్ కోసం నిలబడ్డామన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన గడ్డపై అనేక అక్రమాలు జరుగుతున్నాయని.. ప్రశ్నించిన వారిని అణిచేస్తున్నారని.. మమతా బెనర్జీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.