మోడీ నోట యువత మాట ఎన్ని సార్లు వచ్చిదంటే ?

ప్రధాని నరేంద్ర మోడీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రసంగం చేశారు. ఇదే వేదిక నుంచి ఈసారి ఆయన జాతీయ జెండా ఆవిష్కరించడం ఇది 13వ సారి.

Update: 2026-08-16 04:11 GMT

ప్రధాని నరేంద్ర మోడీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రసంగం చేశారు. ఇదే వేదిక నుంచి ఈసారి ఆయన జాతీయ జెండా ఆవిష్కరించడం ఇది 13వ సారి. ఈ విషయంలో మోడీ రికార్డు సాధించారు. ఇక ఎర్ర కోట ప్రసంగానికి మోడీ ప్రతీ ఏటా వేష ధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఆయన ధరించే తలపాగా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోడీ స్పీచ్ కూడా జనాలు ఎపుడూ ఆసక్తిని చూపిస్తూ వింటారు. అయితే మోడీ స్పీచ్ లో దేశానికి సంబంధించిన అనేక అంశాల ప్రస్తావన ఉంది. అలాగే ఎన్డీయే ప్రభుత్వం హయాంలో సాధించిన అభివృద్ధిని ఆయన మరోసారి ఇంతటి మహత్తర వేదికను ఆసరాగా చేసుకుని జాతికి వినిపించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మోడీ స్పీచ్ లో ఈసారి అసలైన స్పెషాలిటీ ఉందని అంటున్నారు. అదేంటి అంటే విశేషమైనదే అని చెబుతున్నారు.

యువ జపంతోనే :

మోడీ నోట యువత మాట జపంగా మారింది అని అంటున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చిన సంగతి విధితమే. ఈ నేపధ్యంలో కేంద్ర కేబినెట్ లో ఒక మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో యూత్ దెబ్బ ఎంటో పెద్దలకు బాగా తెలిసి వచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలో మోడీ అయితే తరచుగా ఇన్స్టా గ్రాం లో వీడియో పోస్టులు పెడుతూ వచ్చారు. అంతే కాదు ఆయన స్వయంగా తన కేబినెట్ సహచరులకు కూడా ఇన్స్టా లో ఎక్కువగా టచ్ లో ఉండమన్నారు. వీడియో పోస్టులతో యూత్ ని కనెక్ట్ కావాలని దిశా నిర్దేశం చేశారు. మరి మోడీ కూడా అదే పనిలో ఉన్నారని అంటున్నారు.

లెక్క చూసి మరీ :

మోడీ తన ప్రసంగంలో కనీసంగా ఒక పాతిక ముప్పై సార్లు యువత గురించి ప్రస్తావించారని చెబుతున్నారు. ఇన్ని సార్లు ఒక కీలక ప్రసంగంలో ఒక వర్గం గురించి ప్రధాని స్థాయి వ్యక్తులు గతంలో ప్రస్తావించిన సందర్భాలు అయిఏ తక్కువ అని అంటున్నారు. భారతీయ సమాజంలో మహిళకు రైతులు ఇలా వీరి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే అది కూడా ఒకటికి రెండు మూడు సార్లు తప్పించి ఉండదు, కానీ ఇపుడు యువత గురించి మాత్రం అత్యధికంగానే పాలకులు మాట్లాడుతున్నారు. మోడీ అయితే యువతకు తమ ప్రభుత్వం ఏమి చేస్తుందో ఎర్ర కోట వేదికగా ఆగస్టు 15 వేడుకలను ఉద్దేశించి చెప్పారు. దీంతో యూత్ కి ప్రధాని స్థాయిలో ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

వారే కీలకం అంటూ :

ఇక 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తి పాత్రే కీలకమని స్పష్టం చేశారు. అందుకే వారి కోసం కేంద్ర ప్రహ్బుత్వం తరఫున పలు నూతన పథకాలను అలాగే సంచలన ప్రకటనలు మోడీ చేయడం విశేషం. యువతకు ప్రకటించిన ప్రధాన హామీలు చూస్తే ఇలా ఉన్నాయి. యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అని ఆయన పేర్కొన్నారు. అంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద మధ్యతరగతి అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సౌకర్యం కల్పించనున్నట్లుగా ప్రధాని చెప్పారు అన్న మాట.

కోటి మంది యువతకు :

అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యువతకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తామని కూడా ప్రధాని ప్రకటించారు. వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐ రంగంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లుగా మోడీ వెల్లడించారు. ఇక క్రీడా ప్రతిభ అన్వేషణలో యువతకు పట్టం కడతామని అన్నారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లుగా మోడీ కీలక ప్రకటన చేశారు. స్టార్టప్‌లు ఇన్నోవేషన్ వంటి వాటిలో యువ ఫోకస్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకుటామని చెప్పారు. యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ కల్పనదారులుగా మారాలని యువత మారాలని మోడీ పిలుపు ఇచ్చారు. ఈ దిశగా నూతన ఆవిష్కరణల కోసం ఒక లక్ష కోట్ల నిధిని అందుబాటులోకి తెచ్చినట్లుగా ప్రధాని ఎర్ర కోట వేదికగా యువతకు గుర్తుచేశారు.

Tags:    

Similar News