మోడీకి ప్రేమతో.. మహేష్, రాజమౌళి సహా ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన విషెస్
సినీ ప్రపంచం నుంచి సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి, పవర్ స్టార్ , ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ శుభాకాంక్షలు తెలియజేశారు.;
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కళాకారులందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు వీడియోలు, పోస్టుల రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా #MyModiStory అనే హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకున్న ప్రత్యేక వీడియోలు, పోస్టులు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
* సినిమా ప్రముఖులు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన
సినీ ప్రపంచం నుంచి సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి, పవర్ స్టార్ , ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీని మొదటిసారి కలిసినప్పుడు జరిగిన సంభాషణలను గుర్తుచేసుకుంటూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు.
పవన్ కళ్యాణ్ తన వీడియోలో మాట్లాడుతూ మోదీ అచంచలమైన క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగారని కొనియాడారు. భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల ప్రతి పౌరుడిలో గర్వభావం కలిగేలా ఆయన ప్రేరేపించారని, 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ విశ్వవిజేతగా ఎదుగుతోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ఆయన సంకల్పానికి అందరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.
క్రీడా రంగం నుంచి క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆత్మవిశ్వాసం, కష్టపడి పనిచేసే తత్వం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
* ట్రెండింగ్‌లో #MyModiStory
#MyModiStory హ్యాష్‌ట్యాగ్‌తో వేల సంఖ్యలో పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాన్య ప్రజలు కూడా ప్రధాని మోదీతో వారికి కలిగిన అనుభవాలను, ఆయనతో పంచుకున్న స్ఫూర్తిదాయక క్షణాలను తమ పోస్టులలో పంచుకుంటున్నారు.
ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరి సందేశంలో ఆయనకున్న అచంచలమైన శక్తి, కృషి, దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మరింత ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.