జపాన్ శాస్త్రవేత్తల తోపు ఆవిష్కరణ.. అదేమంటే?

మానవాళిని చూస్తే ప్లాస్టిక్ ను విపరీతంగా వినియోగించే మానవాళికి ముందుకు తర్వాత అన్న విభజన తప్పనిసరి.;

Update: 2025-03-30 05:35 GMT

మానవాళిని చూస్తే ప్లాస్టిక్ ను విపరీతంగా వినియోగించే మానవాళికి ముందుకు తర్వాత అన్న విభజన తప్పనిసరి. యాభై ఏళ్ల క్రితం మనిషి జీవితంలో ప్లాస్టిక్ భాగం.. ఇప్పుడు లెక్క వేసుకుంటే తేడా ఇట్టే అర్థమవుతుంది. నిజానికి ఈ రోజున ప్లాస్టిక్ వినియోగం లేనిదే పొద్దుగడవని పరిస్థితి. ప్రతి అంశంలోనూ ప్లాస్టిక్ ను నివారించలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సముద్ర జలాల్లో పేరుకు పోయిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కారణంగా మనిషి మనుగడకే ముప్పుగా మారిన పరిస్థితి.

ఇలాంటివేళ.. ఈ ముప్పును తగ్గించేందుకు శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. దీనికి కారణం జపాన్ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణే. సముద్ర జలాల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ కు ఒక పరిష్కారాన్ని గుర్తించారు. ఉప్పునీటిలో కరిగిపోయే ప్లాస్టిక్ ను వారు ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఉన్న ప్లాస్టిక్ ను కరిగించటం సాధ్యమయ్యేది కాదు. అందుకు భిన్నంగా తాజాగా కనుగొన్న ప్లాస్టిక్ ఉప్పు (సముద్ర) జలాల్లో ఇట్టే కరిగిపోతుంది.

సుప్రామాలిక్యులర్ అని పిలిచే ఈ వినూత్న ప్లాస్టిక్ సాధారణంగా ఉపయోగిస్తున్నప్పుడు నాణ్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే సమయంలో సముద్ర జలాల్లో కానీ.. ఉప్పు నీటిలో కాని కలిస్తే సురక్షితంగా అందులో కరిగిపోతుంది. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని చేయనిదిగా గుర్తించారు. జపాన్ లోని సెమ్స్ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త ప్లాస్టిక్ ను కనుగొన్నారు. దీంతో.. ఈ కొత్త తరహా ప్లాస్టిక్ ను విస్తృతంగా వాడుకలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News