• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇంట్రెస్టింగ్ : పిఠాపురం...

ఇంట్రెస్టింగ్ : పిఠాపురం వర్మ విత్ జనసేన

| పిఠాపురంలో కూటమిలో విభేదాలు ఉన్నాయని ఏపీ అంతా చాలా వార్తలు వస్తున్నాయి. ఈ రోజున ఏపీలో హాట్ సీటు ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అని కూడా చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-01 20:26 GMT

పిఠాపురంలో కూటమిలో విభేదాలు ఉన్నాయని ఏపీ అంతా చాలా వార్తలు వస్తున్నాయి. ఈ రోజున ఏపీలో హాట్ సీటు ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అని కూడా చెబుతున్నారు. ఇక పిఠాపురం ఎవరి అడ్డా అని పెద్ద డిస్కషన్ సాగుతూ వస్తోంది. జనసేన అడ్డా పిఠాపురం అని మొదట అన్నది జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన తరువాత మార్చి నెలలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో కొణిదెల నాగబాబు అన్నారు.

పిఠాపురం జనసేనదే అని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పారు. దానికి కాస్తా లేటుగా అయినా కడప మహానాడులో పిఠాపురం నుంచి వచ్చిన టీడీపీ నాయకులు గట్టి రిటార్టు ఇచ్చారు. వర్మ అడ్డా పిఠాపురం అని నూటికి ఎనభై శాతం ఓటు ఆ నియోజకవర్గంలో టీడీపీదే అని కూడా స్పష్టం చేశారు.

దీని కంటే ముందు ఎమ్మెల్సీ అయ్యాక వర్మ పిఠాపురంలో రెండు రోజుల పాటు పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ ఎక్కడా కనిపించలేదు. ఆయనను కావాలని జనసేన నాయకులు పిలవలేదు అని రాజకీయ రచ్చ చేశారు తమ్ముళ్లు. నాగబాబు ఎదుటనే టీడీపీ వర్సెస్ జనసేనగా నినాదాలు చేసుకుని రభస సృష్టించారు.

ఇవన్నీ కళ్ళ ముందు ఉండగానే ఇపుడు మరో సన్నివేశం ఆవిష్కృతం అయింది. అదేంటి అంటే రేషన్ సరకులను చౌక దుకాణాలలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ పిఠాపురం నుంచే దానికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయనతో పాటు పక్కనే వర్మ కనిపించారు. దాంతో ఈ దృశ్యం చాలా మందికి ఆసక్తి గా అనిపించింది. ఉప్పు నిప్పుగా పిఠాపురంలో జనసేన టీడీపీ ఉన్నాయన్న భావన కలిగిన వారికి ఈ కలయిక చాలా ఆశ్చర్యంగానే ఉంది.

అయితే వర్మ జనసేన నేతలతో బాగానే ఉంటారని ఎటొచ్చి స్థానికంగా ఉన్న జనసేన నేతలతోనే టీడీపీ తమ్ముళ్ళకు విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా వర్మ ఆయన పక్కన కనిపించారు అని గుర్తు చేస్తున్నారు.

అయితే టీడీపీ తమ్ముళ్ళకు కోపం అంతా నాగబాబు మీదనేనా అన్న చర్చ వస్తోంది. ఆయనే పవన్ గెలుపు వెనక ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది వారి ఖర్మ అని సెటైరికల్ గా వర్మ మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు అని తమ్ముళ్ళు రగులుతున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ విత్ జనసేన అన్నట్లుగా ఈ సన్నివేశం ఉందని అంటున్నారు. కూటమి సఖ్యంగా సౌఖ్యంగా ఉంటే అందరికీ మంచిదే అని అంటున్నారు.

అయితే అధికారం ఉన్న చోట ఆధిపత్యం పోరు ఒకే పార్టీలో ఉన్నా వస్తుందని అలాంటిది రెండు పార్టీల మధ్య కాబట్టి ఇలాగే ఉంటుందని అంటున్నారు. అయినా వర్మ పెద్ద మనసుతో సర్దుకుపోతునారని జనసేన పెద్దలు కూడా ఆయనకు తగిన మర్యాద గౌరవాన్ని ఇస్తున్న్నారని అంటున్నారు సో పిఠాపురం లో కూటమిలో గరం గరం సన్నివేశాలు ఇక మీదట ఉండవా అంటే ఏమో వెయిట్ అండ్ సీ.

Tags:    
  • Pithapuram 
  • JanaSena 
  • TDP 
  • AndhraPolitics 
  • PawanKalyan 
  • SVSNNadendlaManohar 
  • PoliticalDrama 
  • APPolitics 
  • CoalitionTensions 
  • PoliticalNews 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS