వర్మకు నో ఆప్షన్...అందుకే భావోద్వేగం !
కానీ వర్మ ఆలోచనలు లెక్కలు అంచనాలు అన్నీ తప్పు అని రుజువు అయిపోయింది. అందుకే వర్మకు ఇంచార్జి పదవి నుంచి ఉద్వాసన చెప్పేశారు.;
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వర్తమాన పరిస్థితులు పరిణామాలను గమనిస్తూ ముందుకు సాగాలి. ఎల్లకాలం ఒకేలా ఉండదు, టీడీపీ ఒక్కటే ఉన్నపుడు పిఠాపురం వర్మ ఏమి చెబితే అదే చెల్లు అన్నట్లుగా ఉండేది. కానీ 2024 నుంచి సీన్ మారింది. పొత్తులు కుదిరాయి. జనసేన వచ్చింది. పిఠాపురంలో వర్మ అండ్ కో అవునన్నా కాదన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే కాదు బిగ్ ఫిగర్, కాపులకు ఐకాన్, అంతే కాదు, మొత్తం జనాలకు ఆయన ఒక దిగ్గజ నేత. ఈ విషయం గ్రహించడంలో వర్మ పొరపడ్డారు, తడబడ్డారు, ఆయన జనసేన నేతలతో సఖ్యత కోసం ప్రయత్నించాల్సింది పోయి వారితో సవాల్ చేశారు. అంతే కాదు తాను లోకల్ జనసేన నేతలను అంటున్నాను అని మాత్రమే అనుకున్నారు. టీడీపీ జెండాని నిలబెడుతున్నాను చంద్రబాబు బొమ్మ కోసం ఫ్లెక్సీ కోసం పోరాడుతున్నాను ఇదంతా పార్టీ కోసమే అనుకున్నారు. కానీ వర్మ ఆలోచనలు లెక్కలు అంచనాలు అన్నీ తప్పు అని రుజువు అయిపోయింది. అందుకే వర్మకు ఇంచార్జి పదవి నుంచి ఉద్వాసన చెప్పేశారు.
ఆ మాటలే చెప్పాలి :
ఇక మీడియా ముందుకు వచ్చిన వర్మ తన పదవి పోవడం మీద చాలా ఆవేదన చెందారు. ఒక విధంగా తీవ్ర స్థాయిలో వర్మ భావోద్వేగానికి గురి అయ్యారు. అంతలోనే తేరుకుని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలోని టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా తనను తప్పించడంపై ఆయన స్పందించారు. పార్టీ పెద్దలు అంతా ఈ విషయం ముందే తనను అడిగారు అని అలా తనతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకుందని వర్మ చెప్పుకొచ్చారు.
కట్టుబడి ఉంటాను అని :
అంతే కాదు తాను పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని ప్రెస్‌మీట్‌లో వర్మ స్ట్రాంగ్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక తాను ఏమిటి అన్నది టీడీపీ అధినాయకత్వానికి బాగా తెలుసు అని సమర్ధించుకున్నారు. మిగతా విషయాలు తనకు అనవసరమని కూడా చెప్పారు. తాను టీడీపీ బలోపేతం కోసమే ఇంత కాలమూ పనిచేశాను అని ఆయన చెప్పుకున్నారు. అంతే కాదు పార్టీకి వ్యతిరేకంగా ఏ పనీ చేయలేదని వర్మ తనదైన వాయిస్ వినిపించారు. ఇలా చెబుతున్నపుడు కూడా వర్మ భావోద్వేగానికి గురవ్వడం విశేషం.
కొరవడిన వ్యూహంతో :
కూటమి పార్టీల మధ్య సఖ్యత కోసం కృషి చేయాల్సిన నాయకులు తామే దూకుడుగా వ్యవహరిస్తే ఏమి జరుగుతుంది అన్నది వర్మ ఎపిసోడ్ నిదర్శనం అంటున్నారు. వర్మ కొత్త నాయకుడు కాదు, పాతికేళ్ల పాటు టీడీపీతో బంధం వేసుకున్న నాయకుడు. అనేక ఎన్నికల్లో పోటీ చేశారు. జన సామాన్యంలో మంచి పేరు ఉంది అధినాయకత్వం పెద్దల వద్ద సాన్నిహిత్యం ఉంది. ఇవన్నీ ఆయనకు అనుకూలంగా చేసుకోలేకనే చతికిలపడ్డారు అని అంటున్నారు. ఆయనలో ఫైర్ అన్నది తన కోసం పార్టీ కోసం సానుకూలంగా వినియోగిస్తున్నాను అనుకున్నారే కానీ వాస్తవాలు గుర్తించలేకపోయారు అని అంటున్నారు. అందుకే వర్మ ఇపుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఇంచార్జిగా మిగిలిపోయారని అంటున్నారు. అలాగని వర్మ ఇపుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోలేరు. ఆయన అలా వెళ్ళిన నాడు క్యాడర్ ఆయన వెంట ఏ మేరకు వస్తుంది అన్నది తెలియదు, ఇక వైసీపీ లాంటి పార్టీలు కూడా సామాజిక వర్గంలోని కోణంలో నుంచే ఆలోచన చేసి బాధ్యతలు అప్పగిస్తాయి. మొత్తానికి వర్మకు నో ఆప్షన్ అని అంటున్నారు. తాను ఉన్న చెట్టు కొమ్మను నరుక్కోవడమే రాజకీయాల్లో చేటు తెస్తుంది. వర్మ విషయం తీసుకుంటే అదే జరిగిందా అన్న చర్చ అయితే సాగుతోంది.