''2 వేలు ట్రాన్స్‌ఫర్ చేసేవారు.. 80 పైసలు కట్టలేరా?''
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఇది సాధారణ ప్రజలపై భారం మోపడానికి కాదని.. వ్యాపార వేత్తలకు , పారిశ్రామిక బదిలీలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
నిజం!.. ఈ ప్రశ్న సాధారణ ప్రజల నుంచే కాదు.. తాజాగా సుప్రీంకోర్టు కూడా సంధించింది. ఆన్‌లైన్, డిజిటల్ మాధ్యమాల ద్వారా చేసే నగదు బదిలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల చార్జీలు విధించింది. ఆన్‌లైన్ విధానం.. అంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా జరిగే చెల్లింపులకు ఇప్పటికే చార్జీలు ఉండగా.. తాజాగా యూపీఐ ద్వారా అంటే.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సహా ఇతర డిజిటల్ మాధ్యమాల్లో జరిగే చెల్లింపులకు కూడా.. చార్జీలు విధించింది. వెయ్యి రూపాయల బదిలీకి 40 పైసల చొప్పున విధించింది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఇది సాధారణ ప్రజలపై భారం మోపడానికి కాదని.. వ్యాపార వేత్తలకు , పారిశ్రామిక బదిలీలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. అయినప్పటికీ.. దీనిని మెజారి టీ ప్రజలు అంగీకరించడం లేదు. మరోవైపు.. సోషల్ మీడియాలో.. 2 వేల రూపాయ లు ట్రాన్స్‌ఫర్ చేస్తే.. 80 పైసలు చెల్లించలేరా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనికి మరో కౌంటర్ ఏంటంటే.. ఇప్పుడు వెయ్యికి 40 పైసలేనని.. రాబోయే రోజుల్లో ఇది ఎంత పెరిగినా భరించాల్సి ఉంటుందన్న భయాలు ఉన్నాయి.
ఇదిలావుంటే.. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై రుసుము విధించడాన్ని తప్పుబడుతూ.. పారిశ్రామిక వర్గాలు, ఇతర వ్యాపార వర్గాలు సుప్రీంకోర్టు ఆశ్రయించాయి. ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై తాజాగా సోమవారం విచారణ జరిపిన కోర్టు.. ''2 వేలు ట్రాన్స్‌ఫర్ చేసేవారు.. 80 పైసలు కట్టలేరా?'' అని ప్రశ్నించింది. అంతేకాదు.. యూపీఐ ట్రాన్స్‌ఫర్‌లపై ఎండీఆర్ చార్జీలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నగదు బదిలీ విషయంలో పారదర్శకత కోసమే ఈ విధానం తెచ్చామన్న కేంద్రం వాదనతో సానుకూలత వ్యక్తం చేసింది.
మరోవైపు.. అక్టోబర్ 15 నుంచి ఎండీఆర్ విధించాలన్న నిర్ణయం అమల్లోకి రానుంది. దీనిని సవాల్ చేసిన నేపథ్యంలో అఫిడఫిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ విధానాన్ని రద్దు చేయకపోతే.. వచ్చే నెల 2న దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని వ్యాపారులు ప్రకటించారు. మరోవైపు.. డిజిటల్ ట్రాన్సాక్షన్లను కూడా బంద్ చేయనున్నట్టు వెల్లడించారు.