జ‌గ‌న్ మ‌రో ప‌రామ‌ర్శ‌యాత్ర‌.. పోలీసులు ఏమ‌న్నారంటే!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కుడు కాకుమాను రాజ‌శేఖ‌ర్ ఇటీవ‌ల మృతి చెందారు.

Update: 2026-09-28 11:06 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో త‌న పార్టీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వివిధ కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం గ‌డుపుతున్న వారిని ఆయ‌న ప‌ల‌క‌రిస్తున్నారు. అయితే ఈ ప‌రామ‌ర్శ‌లు.. యాత్ర‌గా మారుతున్నాయి. అదేస‌మ‌యంలో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌గా కూడా మారుతున్నాయి. దీంతో జ‌గ‌న్ యాత్ర‌ల‌కు వ‌చ్చే వారిని నియంత్రించడం.. పోలీసుల‌కు కూడా స‌వాల్‌గా మారుతోంది. దీంతో అనుమ‌తులు కూడా ఇవ్వ‌డం లేదు. ఇక‌, తాజాగా జ‌గ‌న్ మ‌రో ప‌రామ‌ర్శ‌యాత్ర‌కు రెడీ అయ్యారు.

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కుడు కాకుమాను రాజ‌శేఖ‌ర్ ఇటీవ‌ల మృతి చెందారు. విజ‌య‌వాడ లో వైసీపీ నేత‌లు నిర్వ‌హించిన డీఎస్సీ-2025పైనిర‌స‌న‌లో ఆయ‌న కూడా పాల్గొన్నారు. అనంత‌రం.. ఇంటికి వెళ్లిన త‌ర్వాత‌.. గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి రెండు మూడు రోజులు అయిపోయింది. అయితే.. తాజాగా రాజ‌శేఖ‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి ప్ర‌కాశం ఎస్పీకి నాయ‌కులు విన‌తి ఇచ్చారు.

ష‌ర‌తులు ..

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మంగ‌ళ‌వారం ఉద‌యం ఒంగోలు వ‌చ్చి.. కాకుమాను కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు పోలీసులు ఓకే చెప్పారు. అయితే.. ఎలాంటి ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు.. చేయ‌డానికి వీల్లేద‌న్నారు. అలాగే.. బ్యాన‌ర్లు, ప్ల‌కార్డులు బైక్ ర్యాలీలు చేయ‌రాద‌ని కూడా తేల్చి చెప్పారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే.. కేసులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు జ‌గ‌న్ చేసిన యాత్ర‌ల‌ను గ‌మ‌నిస్తే.. పోలీసులు ఆంక్ష‌లు విదించ‌డం.. నాయ‌కులు ఉల్లంఘించ‌డం కామ‌నైపోయింద‌న్న విష‌యం తెలిసిందే.

ఎవ‌రీ కాకుమాను?

వైసీపీ హ‌యాంలో కాకుమాను రాజ‌శేఖ‌ర్‌.. ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప‌నిచేశా రు. ఇటీవ‌లి వ‌ర‌కు వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. ఈ నెల 22న విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ పై వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నా రు. అనంత‌రం. . ఆయ‌న గుండెపోటుతో మృతి చెందారు. పార్టీలో సీనియ‌ర్ నేత‌గానే కావ‌డంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా కూడా ఆయ‌న పేరు ప‌రిశీలన‌లో ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News