నూడుల్స్ అమ్ముతూ నెలకు 30 లక్షలు సంపాదిస్తున్న పీహెచ్డి విద్యార్థి.. ఎక్కడో ఎలాగో తెలిస్తే షాక్!
చైనాకు చెందిన ఒక పీహెచ్డీ గ్రాడ్యుయేట్.. రోడ్డు మీద ఒక చిన్న కొట్టు పెట్టి.. స్పైసీ నూడిల్స్ అమ్ముతూ.. రోజుకి 1200 డాలర్లు సంపాదించేవారు.;
ప్రస్తుతం మనం చదివిన చదువులకు,ఉద్యోగాలకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. కొంతమందికి ఎంత చదివినా కూడా ఉద్యోగాలు రాకపోవడం.. మరి కొంతమందికి ఉద్యోగాలు వచ్చినా.. వచ్చిన జీతం సరిపడక వాటిని వదులుకొని మరీ వేరే మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక పీహెచ్డీ గ్రాడ్యుయేట్.. తన చదువుకు సంబంధం లేకుండా వ్యాపారాన్ని మొదటి పెట్టి.. గొప్ప విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు ఈ వ్యాపారంతో నెలకు రూ.30 లక్షల వరకు సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చైనాకు చెందిన ఒక పీహెచ్డీ గ్రాడ్యుయేట్.. రోడ్డు మీద ఒక చిన్న కొట్టు పెట్టి.. స్పైసీ నూడిల్స్ అమ్ముతూ.. రోజుకి 1200 డాలర్లు సంపాదించేవారు. (ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,05,388 రూపాయలు).ఇలా కేవలం నూడిల్స్ ద్వారానే ప్రతినెల రూ.30 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు ఆ గ్రాడ్యుయేట్. ఇందుకు సంబంధించి న్యూస్ అయితే ఎప్పుడు వైరల్ గా మారుతోంది. వాటి గురించి చూద్దాం.
చైనాలో జిమాంగుస్ ప్రావిస్లో డింగ్ అనే వ్యక్తి చిన్న వయసు నుంచే బాగా చదివేవారు. పైగా మొదటి నుంచి వ్యవసాయ రంగంలో ఆసక్తి ఉండడంతో.. అదే రంగంలో ఉన్నత విద్యను కూడా అభ్యసించారు. చైనాలో పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత బెల్జియంలో సాయిల్ టెక్స్ట్ నిర్వహణకు, పంట ఉత్పత్తికి సంబంధించి వాటిలో రీసెర్చర్ గా పనిచేశారు. అంతేకాకుండా 30కి పైగా అక్కడ అకాడమిక్ పేపర్లను ప్రచురించేవారు. ఇంతటి గొప్ప మేధాశక్తి కలిగిన డింగ్ పరిశోధన రంగంలోనే స్థిరపడాలని చూసినా ఉద్యోగం లభించలేదు.
ఆఖరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో డింగ్, ఆయన భార్య వాంగ్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. నూడిల్స్ స్టాల్ పెట్టాలని నిర్ణయించుకొని తన సొంత పట్టణమైన చొంగ్ కింగ్ లో డింగ్, వాంగ్ 'స్పైసీ పీ నూడిల్స్' ను మొదలుపెట్టారు. ఈ నూడిల్స్ తినడానికి రుచిగా ఉండేందుకు..(స్ట్రాండ్స్, పంది మాంసంతో చేసిన సాస్, బఠాణీలు వంటివి ఉంటాయి). ఇందులోకి కొంచెం ఉప్పు, కారం కలిపి తయారుచేస్తారట. ఇది అక్కడ స్థానికులకు బాగా రుచిగా అనిపించడంతో భారీ సంఖ్యలో కస్టమర్లు వచ్చేలా చేసింది.
డింగ్, వాంగ్ కేవలం వారానికి రెండు సార్లు మాత్రమే ఈ స్టాల్ ను తెరుస్తారట.. ఆ రెండు రోజులలోనే వీరికి ఊహించని స్థాయిలో డబ్బులను తెచ్చిపెట్టేలా చేస్తోంది ఈ వ్యాపారం. ఒక బౌల్ నూడిల్స్ ధర 7 నుంచి 9 యూరోలు కలదు.. అలా వీరు కేవలం ఒక్క రోజులోనే 100 యూరోలకు పైగా సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. సుమారుగా 78 వేలకు పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. ఇలా కేవలం చదువుతోనే కాకుండా తెలివితో కూడా డబ్బులను సంపాదించవచ్చని ఈ జంటను చూస్తే అర్థమవుతుంది.