పేర్ని నాని జగన్ కి నో చెప్పారా ?
పేర్ని నాని 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు అన్న సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మచిలీపట్నం అసెంబ్లీ సీటు నుంచి ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేశారు.;
వైసీపీలో పెద్ద నోరున్న నాయకుడిగా పేర్ని నానికి పేరు. వైసీపీ మీద ఏ రకమైన ఆరోపణలు వచ్చినా లేక వైసీపీని గట్టిగా కాసుకోవాలనుకున్నా ముందు మీడియా వద్దకు వచ్చేది పేర్ని నానినే. ఆయన మాటలలో విరుపు ఉంటుంది. సెటైర్లు ఉంటాయి. హాట్ కామెంట్స్ ఉంటాయి. ఎవరికి ఎలా తగలాలో అలా తగిలే భారీ డైలాగులు ఉంటాయి. అందుకే పేర్ని నానినే వైసీపీ చాలా విషయాల్లో ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీకి అత్యంత నమ్మకస్తుడైన నేతగా ఉంటూ వస్తున్నారు. జగన్ మాటే వేదంగా నడిచే పేర్ని నాని ఏకంగా జగన్ కే నో చెప్పారా అన్నది చర్చగా ఉంది.
జగన్ అడిగినా సరే :
పేర్ని నాని 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు అన్న సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మచిలీపట్నం అసెంబ్లీ సీటు నుంచి ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో ఓటమి పాలు అయ్యారు. నిజానికి ఈ ఎన్నికల్లో పేర్ని నానినే పోటీ చేయమని జగన్ కోరారు అని ప్రచారం జరిగింది. కానీ వారసుడి కోసం పేర్ని నాని తన సీటుని వదిలేసుకున్నారు. వైసీపీ రెండవ మారు గెలుస్తుందని కూడా ఆయన భావించారు అని అంటారు. కానీ జరిగింది వేరు. మొత్తం పార్టీయే ఇబ్బందులో పడింది. దాంతో మళ్ళీ పేర్ని నాని రాజకీయంగా క్రియాసీలం అయ్యారు.
రాజకీయ సన్యాసమే :
ఇదిలా ఉంటే 2029 ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేస్తారా అంటే నో అని చెబుతున్నారు. ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పేర్ని నాని మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. జగన్ తనను 2029లో పోటీ చేయమని అడిగినా చేసేది లేదని తేల్చేశారు. తనకు ఈ రాజకీయాలు చాలు అని అనుకుంటున్నట్లుగా చెప్పారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసాను అని తన వల్ల జరిగింది ఏమిటో జనాలకు చేశాను అని అన్నారు. అయితే తనకు తానుగానే ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు. తన కుమారుడు రాజకీయాల్లోకి రావడంతోనే తనకు మళ్ళీ కొంతకాలం రాజకీయాల్లో ఉండాలని అనిపించింది తప్పితే ఎన్నికల రాజకీయాలకు తాను బహు దూరం అన్నారు. జగన్ అడిగినా తాను ఇదే చెబుతాను అన్నారు. ఇక తాను ఎప్పటికీ పోటీ చేయదలచుకోలేదని ఆయన ఆ మీడియా చానల్ సాక్షిగా స్పష్టం చేశారు.
ఏమి జరుగుతోంది :
నిజానికి చూస్తే పేర్ని నాని సీనియర్. ఆయన వయసు రిత్యా చూసుకున్నా రాజకీయంగా పదవీ విరమణ చేసేటంత కాదు, ఈ రోజుకీ అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన వారు కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. పోటీకి సిద్ధపడుతున్నారు. మరి పేని నానిలో ఎందుకు ఇంత వైరాగ్యం వచ్చింది. ఆయన వైసీపీకి ఒక పిల్లర్ లాంటి నేత, అలాంటి నాయకుడే పోటీకి దూరం రాజకీయాలకు దూరం అంటే వైసీపీ పరిస్థితి ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది. నిజానికి పేర్ని నాని వంటి వారే ఇలా నో చెప్పేస్తే పార్టీలో మిగిలిన వారి సంగతి ఏమిటి అన్నది కూడా చర్చ నడుస్తోంది.
ఏ సంకేతం ఇస్తున్నారు :
వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని జగన్ ఒక వైపు చెబుతున్నారు. అదే సమయంలో కీలక నాయకులు తాము పోటీకి దూరం అని అంటున్నారు ఇది ఏ రకమైన సంకేతం పార్టీలో ఇస్తుంది అన్న చర్చ కూడా ఉంది. కష్ట సమయంలో వైసీపీ ఇపుడు ఉంది. ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. ఈ నేపధ్యంలో వైసీపీని లేపాలి అంటే సీనియర్లు దిగ్గజ నేతల వల్లనే అవుతుంది వారు కాడె వదిలేస్తే ఎలా అన్నది ఉంది. మరి జగన్ లో కనిపిస్తున్న నమ్మకం ఇతర సీనియర్లలో లేదా లేక తాము దూరంగా ఉండడమే బెటర్ అని నిర్ణయించుకుంటున్నారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా పేర్ని నాని రాజకీయ వైరాగ్యం మాత్రం వైసీపీతో పాటు అంతటా చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతోందో. ముందు ముందు ఏమి అవుతుందో ఏమో.