కూట‌మిని ఆలోచ‌న‌లో ప‌డేసిన 'పీడీఎఫ్‌' ..!

కూట‌మి ప్ర‌భుత్వాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గురుమూర్తి ఆలోచ‌న‌లో ప‌డేశారా? అంటే.. ఔన‌నే సమాధాన‌మే వినిపిస్తోంది.;

Update: 2026-02-24 17:04 GMT

కూట‌మి ప్ర‌భుత్వాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గురుమూర్తి ఆలోచ‌న‌లో ప‌డేశారా? అంటే.. ఔన‌నే సమాధాన‌మే వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు ఏటా బ‌డ్జెట్ స‌మ‌యంలో ఇచ్చే రూ.ల‌క్ష‌(ఏటా ఈ మొత్తం మారుతుంది) కూప‌న్ విష‌యంలో గురుమూర్తి వ్య‌వ‌హ‌రించిన తీరుతో కూట‌మి స‌ర్కారు ఆలోచ‌న‌లో ప‌డింద‌ని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు కీల‌క అంశాల‌ను పీడీఎఫ్ ఎమ్మెల్సీ లేవ నెత్తారు. వీటిని ఆయ‌న బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు.

1) స‌భ‌లో గంద‌ర‌గోళం: ఇటు అసెంబ్లీలో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు మాత్ర‌మే ఉన్నారు. వైసీపీ స‌భ్యులు వివిధ కార‌ణాల‌తో స‌భ‌ను బాయ్ కాట్ చేశారు. దీంతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై కూట‌మి సభ్యులే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. వారే ప‌రిష్కారాల‌ను కూడా సూచిస్తున్నారు. గ‌తంలో 2014-19 మ‌ధ్య కూడా ఇలానే టీడీపీ స‌భ్యులే అధికార‌-ప్ర‌తిప‌క్షాలు గా స‌భ‌లో వ్య‌వ‌హ‌రించాయి. దీంతో స‌భ‌లో జ‌రుగుతున్న వ్యవ‌హారాలు స‌జావుగానే సాగినా.. ప్ర‌తిప‌క్షం లేని లోటు క‌నిపించింది.

ఇక‌, మండ‌లి వ్య‌వ‌హారానికి వ‌స్తే.. దీనినే పీడీఎఫ్ ఎమ్మెల్సీ గురుమూర్తి ప్ర‌శ్నించారు. గ‌త 5 రోజులుగా మండ‌లి స‌మావేశాల్లో తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వ‌ర్సెస్ హెరిటేజ్ అంశంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డు తూ.. వైసీపీ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న చేస్తున్నారు. ము్ఖ్యంగా ఇందార్‌పూర్ డెయిరీకి.. హెరిటేజ్‌కు మ‌ధ్య సంబంధం పై చ‌ర్చించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇది అవ‌స‌ర‌మా? అనేది పీడీఎఫ్ ప్ర‌శ్న‌. దీనికి నిర‌స‌న‌గానే ఆయ‌న రూ.ల‌క్ష కూప‌న్‌ను తిరిగి వెన‌క్కి ఇచ్చేశారు.

2) ప్ర‌స్తుతం ఒక్కొక్క‌రికీ రూ.ల‌క్ష చొప్పున కూప‌న్‌లు అందించ‌డం: వాస్త‌వానికి ఆర్థిక ప‌రిస్థితి బాగోన‌ప్పు డు.. ఎమ్మెల్యేల‌కు రూ.ల‌క్ష చొప్పున కూప‌న్‌లు ఎందుక‌న్న‌ది పీడీఎఫ్ ప్ర‌జాప్ర‌తినిధుల ప్ర‌శ్న‌. పైగా ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో కూడాపెద్ద ఎత్తున దుమారం రేగింది. రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి బాగోన‌ప్పుడు.. రూ.2 కోట్ల మేర‌కు ఖ‌ర్చు చేసి ప్ర‌జాప్ర‌తినిధులు ఎందుకు ఇస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. అయితే.. ఇది సంప్ర‌దాయంగా వ‌స్తోంద‌ని స‌ర్కారు స‌మ‌ర్థించుకుంటోంది. ఏదేమైనా.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కూట‌మి స‌ర్కారును ఆలోచ‌న‌లో ప‌డేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News