చివరకు ఎటూ కాకుండా పోతారేమో!

ఇప్పటివరకు రెండు పడవల ప్రయాణం ఎవరికీ అచ్చిరాలేదన్న విషయాన్ని కూడా పవన్ గ్రహించటంలేదు.

Update: 2023-10-27 05:21 GMT

రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలుండవని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఒక్కోసారి తమను తాము ఎంత గొప్పవారమని ఊహించుకుంటున్నా కాలం కలసిరాకపోతే చేసేదేమీ ఉండదు. ఇపుడు ఇదంతా దేనికంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే. మొదటినుండి పవన్ లో మైనస్ ఏమిటంటే తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటారు. పోయిన ఎన్నికల్లో రెండుచోట్లా పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కు తత్వం బోధపడలేదు.

ఇపుడు విషయం ఏమిటంటే ఏకకాలంలో రెండు పడవలపైన కాళ్ళు పెట్టి ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు పడవల ప్రయాణం ఎవరికీ అచ్చిరాలేదన్న విషయాన్ని కూడా పవన్ గ్రహించటంలేదు. ఏపిలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు.ఇదే సమయంలో తెలంగాణాలో బీజేపీతో పొత్తులో ఎన్నికలకు వెళుతున్నారు. ఇప్పటికైతే బీజేపీ-టీడీపీలు దూరంగానే ఉంటున్నాయి. టీడీపీతో చేతులు కలపటానికి బీజేపీ ఏమాత్రం ఇష్టపడటంలేదన్న విషయం అందరు చూస్తున్నదే.

ఉత్తర ధక్షిణ ధృవాలుగా ఉన్న బీజేపీ, టీడీపీలతో రెండు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవాలని అనుకోవటమే పవన్ తప్పు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోను జనసేనకు ఉన్నబలం చాలా పరిమితం. ఏపీలో ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కొంత బలపడిందని జనసేన నేతలు చెప్పుకోవటమే. ఎంత బలపడింది, జనసేన బలమెంత అన్నది వచ్చే ఎన్నికల్లో గానీ స్పష్టతరాదు. ఇదే సమయంలో తెలంగాణాలో అసలు బలమే లేదు. పార్టీ పెట్టిన దగ్గర నుండి పవన్ దృష్టంతా పూర్తిగా ఏపీమీదే ఉందికాని తెలంగాణ మీద లేదు.

Read more!

రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని అనుకోవటం కూడా పవన్ చేస్తున్న ప్రయోగమనే చెప్పుకోవాలి. ఇలాంటి ప్రయోగాలను స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చేస్తారు కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు చేయరన్న విషయం కూడా పవన్ కు తెలీకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇటు బీజేపీ అయినా అటు టీడీపీ అయినా పెద్ద పార్టీలన్న విషయం పవన్ మరచిపోయినట్లున్నారు. ఏదైనా తేడా వచ్చిందంటే పై రెండు పార్టీలు సేఫుగానే ఉంటాయి. మధ్యలో ముణిగిపోయేది జనసేన మాత్రమే అన్న విషయం పవన్ కు అర్ధకావటంలేదు. మరి పవన్ ప్రయోగం చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News